»   » కాజల్ పై కస్సుమంటున్న నిర్మాతలు...నోటీసు

కాజల్ పై కస్సుమంటున్న నిర్మాతలు...నోటీసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి..కానీ కాజల్ మాత్రం రివల్స్ లో బిహేవ్ చేస్తోంది. రోజూ సెట్ కు లేటు గా రావటమే. ఎన్ని సార్లు చెప్పినా మారటం లేదు అంటూ కోప్పడుతున్నారు ఆమెతో ప్రస్తుతం పనిచేస్తున్న తమిళ నిర్మాతలు. ఆమె లేటుగా రావటంతో తమ షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అవటమే కాకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగటం లేదని, కాజల్ కాంబినేషన్ డేట్స్ కోసం మిగతా వాళ్లని బ్రతిమిలాడుకోవాల్సివస్తోంది. దాంతో చాలా ఇబ్బంది ఎదురౌతోందని ఆమెకు నోటీసు ఇవ్వటం జరిగిందని తమిళ సినీ వర్గాల చెప్తున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ లేటు కారణం...కొన్ని బాలీవుడ్ చిత్రాలు ఇదే సమయంలో డేట్స్ ఇవ్వటమే అంటున్నారు. అక్కడ,ఇక్కడ తమిళంలోనూ ఒకేసారి పనిచేయాల్సి రావటంతో ఆమె ప్లైట్ లలో అటు ఇటూ తిరుగుతోందని, ఎక్కడ లేటైనా తమ సెట్ లకు లేటు గా వస్తోందని అంటున్నారు. అక్కడ నైట్ డేట్స్ ఇచ్చింది.

తమిళంలో ధనుష్ తో సినిమా చేస్తూ అదే సమయంలో హిందీలో రణదీప్ హుడా తో చేస్తున్న చిత్రానికి ముంబైలో నైట్ షెడ్యూల్ కు హాజరవుతోంది. కాబట్టి అటో, ఇటో తేల్చుకోమంటున్నారు తమిళ నిర్మాతలు. తమిళ నిర్మాతల మండలి సైతం ఈ విషయమై సీరియస్ గా ఉండబోతోందని సమాచారం. ఈ విషయమై కాజల్ స్పందన తెలియరాలేదు. వీటికి తోడు వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా ఉందీ భామ. సినిమాల కంటే యాడ్స్‌కే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Tamil producers angry with Kajal Agarwal

కాజల్‌ మాట్లాడుతూ ‘‘సినిమా జయాపజయాలనేవి అభిమానుల చేతుల్లోనే ఉంటాయి. అందుకే వారి అభిరుచికి అనుగుణంగా నటించడానికి ప్రయత్నిస్తాను. నా నటనలో లోపాలు చెబితే తరువాత సినిమాలో అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను. అలాగే కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా అభిమానుల సలహాల్ని పాటిస్తాను'' అని చెప్పుకొచ్చింది.


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం దాటినా.. మంచి మైలేజ్ తో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి ప్రస్తుతం అవకాశాలు కొంచెం సన్నగిల్లాయి. అయితే తాజా సినిమా టెంపర్ తో టాప్ లేపి.. మళ్లీ టాప్ చైర్ కైవసం చేసుకోవాలని సెక్సీ ఫోజులతో యూత్ కు గాలం వేస్తోంది.

ఇటీవల తెలుగులో వచ్చిన టెంపర్ సినిమాలోనూ వెండితెర అంతా అందాలు ఆరబోసి జనాలకు మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు టెంపర్ లోనూ గ్లామర్ స్ట్రోక్ ఇచ్చి సెగలు పుట్టించేందుకు సిద్ధమైంది. ఈ ముద్దుగుమ్మకి తెలుగునాట మాత్రమే కాదు.. అటు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ పోషించి.. రసికప్రియులను భలే రంజుగా రంజింప చేసిన కాజల్ మనసు ఇప్పుడు దారి మళ్లిందట.

కోలీవుడ్‌లో అయితే అందరూ పెద్ద హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయిట. అందుకే పెద్ద హీరోలైతేనే చేస్తానని చెబుతోంది కాజల్. ప్రస్తుతం విశాల్, ధనుష్, విక్రమ్ చిత్రాలలో ఆమె నటిస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలతో ఒకేసారి నటిస్తుండం ఆనందాన్నిస్తోందని చెప్పుకొచ్చింది.

English summary
Everyday Kajal Agarwal is turning out late on the sets of her movies and Tamil producers have issued a notice to her in connection with this. She has Danush’s flick shoot going on in Tamil while she shoots with Randeep Huda at nights in Mumbai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu