»   » పీకల్లోతు కష్టాల్లో వడివేలు.. కోట్లు కక్కాల్సిందేనట.. అల్టిమేటం జారీ..

పీకల్లోతు కష్టాల్లో వడివేలు.. కోట్లు కక్కాల్సిందేనట.. అల్టిమేటం జారీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Complaint Filed Against Popular Comedian

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు వడివేలు సినీ జీవితంలోనే హింసించే 23వ రాజు పులకేసి అద్బుతమైన చిత్రంగా నిలిచింది. ఓ గొప్ప నటుడిగా ఆవిష్కరించిన చిత్రమది. ఆ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా హింసించే 24వ పులకేసి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ విషయంలో తమను ఇబ్బందికి గురిచేశాడని నిర్మాతలు పోలీసులకు, నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

వడివేలు తీరుతో..

వడివేలు తీరుతో..

దర్శక, నిర్మాత శంకర్ ఫిర్యాదు ప్రకారం.. వడివేలు ఈ చిత్ర షూటింగ్‌లో సరిగా సహకరించలేదట. దాంతో ఆ చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దాంతో వడివేలుపై పలువురికి ఫిర్యాదు చేశారు.

వడివేలుతో శంకర్ చర్చలు

వడివేలుతో శంకర్ చర్చలు

తొలుత వడివేలుతో శంకర్ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఇక లాభం లేదనుకొని ఈ వివాదాన్ని శంకర్ వెంటనే నిర్మాత మండలి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో తాజాగా వడివేలుకు అల్టిమేటం జారీ చేసింది.

 వడివేలకు రెండు ఆప్షన్స్

వడివేలకు రెండు ఆప్షన్స్

ఇటీవల చిత్ర యూనిట్‌కు, వడివేలు మధ్య ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వడివేలుకు నిర్మాత మండలి రెండు రకాలు ఆప్షన్స్ ఇచ్చినట్టు సమాచారం.

 స్క్రిప్టులో జోక్యం

స్క్రిప్టులో జోక్యం

నిర్మాతల మండలి మొదటి ఆప్షన్ ప్రకారం.. హింసించే రాజు 24వ పులకేసి చిత్రం షూటింగ్‌కు వెంటనే హాజరుకావడం అనేది మొదటి ఆప్షన్. అలాగే స్క్రిప్టులో జోక్యం చేసుకోవడం గానీ, లేదా ఇతర షరతులు లేకుండా షూటింగ్‌కు సహకరించాలని మండలి స్పష్టం చేసింది.

నష్టాన్ని చెల్లించాల్సిందే

నష్టాన్ని చెల్లించాల్సిందే

ఒకవేళ మండలి విధించిన రెండు షరతులను సంతృప్తి పరచడం సాధ్యపడకపోతే ప్రొడక్షన్ యూనిట్‌కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని వడివేలుకు అల్టిమేటం జారీ చేసింది.

8 కోట్లు చెల్లించాల్సిందే..

8 కోట్లు చెల్లించాల్సిందే..

వడివేలు సహకరించకపోవడం వల్ల దర్శకుడు శంకర్‌కు సుమారు 7.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకర్ వెల్లడించిన మొత్తానికి వడ్డీతో సహా మొత్తం 8 కోట్లు చెల్లించాలని మండలి హుకుం జారీ చేసింది.

English summary
After Imsai Arasan 23 am Pulikesi, director Shankar announced that he will be bankrolling Imsai Arasan's sequel titled Imsai Arasan 24 am Pulikecei with Vadivelu. But That movie stalled because of creative differences between Shankar and Vadivelu. In this connection, Tamil Producers Council issues Vadivelu an ultimatum
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu