twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా జరిగితే 'కాలా' నిర్మాతకు చుక్కలే.. 70 కోట్లవరకు నష్టం వచ్చే ప్రమాదం!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రంపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. రేపు జూన్ 7 న ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా ఇప్పటికి ఆ విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. కాలా చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. కావేరి జలవివాదం, ముంబైలో కాలా కథకు సంబందించిన వివాదం ఇలా అనేకం కాలా చిత్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

    Recommended Video

    Tammareddy Bharadwaja Talks About Kaala Movie
    కేసుల మీద కేసులు

    కేసుల మీద కేసులు

    కాలా చిత్రం వివాదాలతోనే వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 7 న చిత్రాన్ని విడుదల చేయాలని ఆమధ్య నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ సందర్భంలో వివిధ కేసుల వలన ఈ చిత్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

    కావేరి వివాదం

    కావేరి వివాదం

    కాలా చిత్రాన్ని కావేరి జల వివాదం వేధిస్తోంది. తమిళనాడుకు అనుకూలంగా రజినీకాంత్ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో ఈ చిత్రాన్ని విడుదల కానీయం అని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే తమిళనాడులో సినిమా విడుదల కానీ పరిస్థితి ఉందని తమ్మారెడ్డి అన్నారు.

    రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే

    రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే

    రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఈ పరిస్థితి నెలకొని ఉందని తమ్మారెడ్డి అన్నారు. మొత్తానికి కాలా చిత్రం పెద్ద చిక్కుల్లోనే ఉందని తమ్మారెడ్డి తెలిపారు.

    తెలుగు రాష్ట్రాల్లో కూడా రచ్చే

    తెలుగు రాష్ట్రాల్లో కూడా రచ్చే

    తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలా చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. కొచ్చాడియాన్ చిత్ర వివాదం ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంతో బయ్యర్లు భారీస్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి కేసు కోర్టులో నడుస్తోంది. అది తేలితే కానీ ఇక్కడ కాలా చిత్రాన్ని విడుదల చేయడానికి వీలు లేదని హెచ్చరిస్తున్నారు.

    అలా ముడి పెట్టడం సరికాదు

    అలా ముడి పెట్టడం సరికాదు

    రాజకీయ అంశాలకు, సినిమాకు ముడిపెట్టడం సరికాదని తమ్మారెడ్డి అన్నారు. కాలా చిత్ర విడుదల సాఫీగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాతలు కూడా చిత్రాన్ని నిర్మించే సమయంలో అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉందని అన్నారు.

    70 కోట్లు నష్టం వచ్చే ప్రమాదం

    70 కోట్లు నష్టం వచ్చే ప్రమాదం


    కాలా చిత్రం కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాకపోతే నిర్మాతకు 70 కోట్లవరకు నష్టవాటిల్లే ప్రమాదం ఉందని తమ్మారెడ్డి అన్నారు. అంత నష్టం వస్తే నిర్మాత పరిస్థితి ఏంటని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

    English summary
    Tammareddy about Rajinikanth's Kaala Ban in Karnataka. If it happens more than 70 cr loss to producer says Tammareddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X