»   » న్యూజ్ లాండ్ లో తాప్సీ చలి తట్టుకోలేక...

న్యూజ్ లాండ్ లో తాప్సీ చలి తట్టుకోలేక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాప్సీకు ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. ఆమె ఏది చెపితే అది క్షణాల్లో దర్సక,నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె కోసం ముందుగా అనుకున్న లొకేషన్ ని ఛేంజ్ చేసారు.దానికోసం చాలా ఖర్చయినా నవ్వుతూ నిర్మాత ఖర్చుపెట్టారు. ఆ అసౌకర్యాన్ని దర్శకుడు,హీరో ఏమీ కామెంట్ చెయ్యకుండా భరించారు. అదెక్కడ జరిగిందీ అంటే..న్యూజిలాండ్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం బాగా చల్లగా ఉండడంతో తాప్సీ తట్టుకోలేకపోయిందట. దాంతో పాటలో ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించలేకపోయింది. డాన్స్ డైరక్టర్ చూపే స్టెప్స్‌ వేయలేకపోయింది. దాంతో తాప్సీ ఇబ్బందిని గమనించిన దర్శకుడు ఏకంగా లొకేషన్‌ మార్చేశాడు. చల్లదనం లేని లొకేషన్‌ ఎంపికచేయాల్సిందిగా నిర్మాతను ఆదేశించాడు. క్షణాల్లో అది జరిగిపోయింది.ఇక ఆ సినిమా తెలుగు సినిమా కాదు..తమిళ సినిమా వందన్ వేండ్రన్. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ,జీవా నటిస్తున్నారు.

English summary
A song sequence was shot in New Zealand last week. Tapsi who was not able to bear the chill, suffered a lot. The song sequence was not shot at the desired spot because of this, director Kannan revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu