»   » ఆ రొమాంటిక్ ఛాన్స్ మళ్ళీ వస్తుంది: తాప్సీ

ఆ రొమాంటిక్ ఛాన్స్ మళ్ళీ వస్తుంది: తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ నటించిన 'ఝమ్మందినాదం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. తొలి సినిమా నుంచే హాట్ గర్ల్ గా పేరుతెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు" చిత్రంలో నటిస్తోంది. తాప్సీ 'చష్మే బహద్దూర్"అనే చిత్రంతో బాలీవుడ్‌ లోకి రంగప్రవేశం చేస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి 'మిస్టర్ పర్‌ ఫెక్ట్" మినహా చెప్పుకోదగ్గ విజయాలు సొంతం చేసుకోలేక పోతున్న ఈ పంజాబీ బొమ్మకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారి పోయి ఆ అవకాశం కాజల్‌ని వరించింది. అదీ తనకు డేట్స్ కుదరని కారణంగా. సూర్య కథానాయకుడిగా 'రంగం"ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తమిళంలో కల్పాతి ఎస్ అఘోరం నిర్మిస్తున్న చిత్రం 'మావూటాన్".

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటించే ఛాన్స్ ముందు తాప్సీకే దక్కినా అప్పటికే ఆమె మరో ప్రాజెక్ట్ ని అంగీకరించడంతో సూర్యతో కె.వి.ఆనంద్ రూపొందిస్తున్న 'మావూటన్"లో నటించే సువర్ణావకాశాన్ని చేజార్చుకోవాల్సి వచ్చిందట. అయితే ఈ విషయం గురించి తాప్సీ స్పందిస్తూ' ఇది సూర్య, కె.వి.ఆనంద్‌ల కాంబినేషన్‌ లో వస్తున్న చివరి సినిమా కాదు. వారిద్దరి కాంబినేషన్లో రానున్న రోజుల్లో ఎన్నో సినిమాలు రూపొందే ఛాన్సుంది. సూర్య, కె.వి.ఆనంద్‌లతో కలిసి పనిచేసే రోజు మళ్లీ వస్తుంది. ప్రస్తుతం వారితో పనిచేసే అవకాశం మిస్సయినందుకు బాధపడటంలేదు'అంటోంది.

English summary
We hear that Tapsi was the first choice in KV Anand direction movie Mataran opposite Surya, which is now bagged by Kajal Agarwal. When asked her about having missed out on the role and being paired opposite Surya who is now considered a top actor in Tamil, she says, “This is not the last film that Anand sir or Surya will be doing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu