»   » తాప్సీకి ‘మొగుడు’, ‘వందాన్ వెండ్రాన్’ పై ఆశలు ఎక్కువే..

తాప్సీకి ‘మొగుడు’, ‘వందాన్ వెండ్రాన్’ పై ఆశలు ఎక్కువే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగు చిత్ర సీమకు వచ్చి వాలిన ఢిల్లీ పక్షి తాప్సికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కష్టపడి చేస్తున్న సినిమాలు ప్లాపావుతుంటే ఏదో ఉన్నాంలే అనిపించే సినిమాలు హిట్టై తాప్సికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నాయి. జుమ్మంది నాదం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయిన ఢిల్లీ భామ తాప్సి ఆ చిత్రం అంతగా విజయవంతమవకపోయినా యువతలో గ్లామర్ క్వీన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విడుదలయిన వస్తాడు నా రాజు ఫ్లాప్ అయ్యి తాప్సి కెరీర్ ను ప్రమాదంలో పడేసింది. అలాంటి సమయంలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ హిట్ కాస్త ఉరట నిచ్చింది. కానీ అందులో అమ్మడిది రెండో కధానాయకి పాత్ర కావటంతో సక్సెస్ లో ఎక్కువ భాగం కాజల్ కే దక్కింది.

అలాగే మొన్నీమద్య విడుదలైన వీర సినిమాలో అందాలను విచ్చలవిడిగా అరబోయటంలో ముందు వెనుక చూసుకోకుండా నటించింది. సినిమా ప్లాపైంది అనే భాద కంటే అంతలా కష్టపడి పనిచేస్తే ఆమె టాలెంట్ ను సెన్సార్ వారు గుర్తించకుండా కత్తెరకు పనిచెప్పారు. దాంతో అడవిలో కాచిన వెన్నెల మాదిరి తన కష్టానికి సరైన గుర్తింపు లేకుండా పోతుందని తెగ బాధపడిపోతుంది తాప్సి. అమ్మాయిలను అందంగా చూపించడంలో అందెవేసిన చేయి అయిన కృష్ణవంశీ చేతిలో అయినా తన అదృష్టం మారతుందేమో అనే పిచ్చినమ్మకంతో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న మొగుడు సినిమా మీదే ఆశలన్ని పెట్టుకుంది తాప్సి.

అలాగే తమిళంలోనూ కూడా సినిమాలు చేస్తూ, బిజీగా వున్న తాప్సీ... ఇప్పుడు ఓ తమిళ సినిమా మీద ఆశలు పెట్టుకుంది. తమిళంలో తనకు మరో హిట్ సినిమా వస్తుందని ఎదురుచూస్తోంది. ఆ సినిమా పేరు 'వందాన్ వెండ్రాన్'. ఇటీవల వచ్చిన 'రంగం' సినిమాలో హీరోగా నటించిన జీవా ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ టైం లో నాకిది ఓ ప్రత్యేకమైన సినిమా. ఇందులో నా క్యారెక్టర్ తో బాటు, నా వస్త్రధారణ కూడా వెరైటీగా వుండి, ఆకట్టుకుంటుంది. దర్శకుడు కన్నన్ నా పాత్రను, సినిమాను జనరంజకంగా మలచారు" అంటూ తెగ గొప్పలు చెబుతోంది తాప్సీ. తెలుగులో ఇటీవల వచ్చిన వీర సినిమా ఫ్లాప్ అవడంతో తాప్సీ కాస్త అప్సెట్ అయిన తాప్సీ ఇటు మొగుడు అటు 'వందాన్ వెండ్రాన్' సినిమాతో తను మళ్లీ హిట్ కొడతానని నమ్మకంగా చెబుతోంది.

English summary
Vandhan Vendran is the new movie of Jeeva, and is a tamil movie from which Jeeva and Tapsi expects good hopes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu