»   » సూర్యా ఫస్ట్ లుక్ ఇరగ దీసాడు, రవితేజ చేయాల్సింది: తానాసేరింద కూట్టం (ఫొటోలు)

సూర్యా ఫస్ట్ లుక్ ఇరగ దీసాడు, రవితేజ చేయాల్సింది: తానాసేరింద కూట్టం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో వచ్చినసూపర్ హిట్ థ్రిల్లర్ 'స్పెషల్ చబ్బీస్' సినిమా గుర్తుందా? ఒక వేళ చూడక పోతే ఇక ఆగిపోండి. ఎందుకంటే త్వ్వరలో తెలుగులో కూడా ఆ సినిమా చూసేయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ తమిళ్ లో వస్తోంది. హీరో గా సూర్యా ఉన్నాడు కాబట్టి తెలుగులో కూడా రావటానికి చాలా అవకాశాలున్నాయి. ఈ మూవీ పేరు 'తానా సేరింద కూట్టం'.

సింపుల్ గా క‌నిపిస్తున్నాడు

సింపుల్ గా క‌నిపిస్తున్నాడు

న‌య‌న‌తార బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. నిన్న సూర్య పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . ఈ పోస్ట‌ర్ లో సూర్య సింపుల్ గా క‌నిపిస్తున్నాడు. రజినీకాంత్ ఆల్ టైమ్ హిట్ బాషాలోని డైలాగ్ "తానా సేరింద కూట్టం" (అభిమానంతో వచ్చిన వాళ్ళు) నే ఈ సినిమా టైటిల్ గా అనుకున్నారు. అక్కడ బాగానే ఉంది మరి తెలుగులో ఏమిటన్నది త్వరలోనే తెలియనుంది

Tamil actor Surya Sivakumar slapped youth? case filed against him | Oneindia News
విఘ్నేష్ శివన్

విఘ్నేష్ శివన్

‘నానుమ్ రౌడీ దా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్. త్వరలోనే తెలుగు టైటిల్ తో కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

స్పెషల్ చబ్బీస్

స్పెషల్ చబ్బీస్

ఐతే సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా దీన్ని చాలా మార్చేసినట్లు చెబుతున్నారు. ‘స్పెషల్ చబ్బీస్'ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి ఒకప్పుడు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి.. అది ఆటోమేటిగ్గా తెలుగులోనూ పెద్ద స్థాయిలోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి.

త్వరలోనే తెలుగు వెర్షన్ టైటిల్

త్వరలోనే తెలుగు వెర్షన్ టైటిల్

కాబట్టి తెలుగు రీమేక్ కథ ముగిసినట్లే. త్వరలోనే తెలుగు వెర్షన్ టైటిల్ ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్య కాలం లో సూర్యా కి పేద్ద హిట్ అని ఏదీ రాలేదు 24 సోసో అనిపించుకోగా, సింగమ్ 3 మరీ దారుణం గా కూలబడింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాని ఎలాగైనా హిట్ అనిపించాలన్న పట్టుదలతో ఉన్నాడట సూర్యా. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

English summary
The movie Thaana Serndha Koottam first look and second look posters released on 23rd july, on the occasion of surya's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu