»   » మోసం చేశాడు, చిత్రహింసలు పెడుతున్నాడు: నటుడి భార్య కంప్లయింట్

మోసం చేశాడు, చిత్రహింసలు పెడుతున్నాడు: నటుడి భార్య కంప్లయింట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నటుడు తాడి బాలాజీపై ఆయన భార్య నిత్య పోలీస్ కమీషనర్‌కు కంప్లైంట్ చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ తన భర్త వల్ల తాను ఎదుర్కొంటున్న చిత్ర హింసలు, ఇబ్బందులను మీడియా ముందు ఏకరవుపెట్టుంకుంది.

తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని.... బాలాజీతో పెళ్లయిన తర్వాతే అతడికి ఇప్పటికే పెళ్లయి ఓ భార్య, కుమారుడు ఉన్న విషయం తెలిసిందని, అయినా సరే అడ్జస్ట్ అయి జీవించానని నిత్య తెలిపారు.కొన్ని రోజులుగా తన భర్త తనను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తాగొచ్చి కొడుతున్నాడని, గత నెలలో అతడి వల్ల తీవ్రగాయాపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.


తాను ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి దాడి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. అతడి వల్ల రెండు మూడు చోట్ల పని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన భర్త నుండి తనను కాపాడాలని నిత్య చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.


English summary
Thadi Balaji and his wife Nithya had a fall out, following which the latter filed for divorce. She gave a tearful statement at a press meet saying about how the comedian had abused her, suspected and defamed her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu