»   »  నాకొక 'బాహుబలి' కావలిరా

నాకొక 'బాహుబలి' కావలిరా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: బాహుబలిలాంటి భారీ చిత్రంలో నటించాలని, హిట్ కొట్టాలని అందరి హీరోలకూ ఉంటుంది. అయితే అందరికీ రాజమౌళి దొరకరు కదా. అందుకే తన దర్శకులకు బాహుబలి తరహా చిత్రం రూపొందించమని,కొత్తగా ట్రే చేయమని పురమాయిస్తున్నారు. ఆ లిస్ట్ లో తమిళ స్టార్ హీరో అజిత్ సైతం చేరారు. తనకో బాహుబలి కావాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గతంలో తనతో బిల్లా, ఆరంభం వంటి సూపర్ హిట్ అందించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం ప్లాన్ చేస్తున్నారనే తమిళ సినీ వర్గాల సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.....

Thala Ajith to act in Historical film under Vishnuvardhan direction

అజిత్ కు ఈ ఆలోచన రావటంతో వెంటనే దర్శకుడు విష్ణువర్ధన్ స్థానిక మైలాపూర్‌లో ఉన్న ప్రముఖ రచయిత బాలకుమార్ ని కలిసారు. బాలకుమార్ రాసిన ఉడయాన్ నవల చిత్రంగా తెరపై ఆవిష్కరించాలని నిర్ణయించారు.

ఇది రాజరాజచోళన్ తంజావూర్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి చేసిన సాధనలే ఈ ఉడయాన్ నవల ఇతివృత్తం. ఇప్పుడీ నవలను చిత్రంగా మలచే పనిలో దర్శకుడు విష్ణువర్ధన్, రచయిత బాలకుమార్‌లు నిమగ్నమయ్యారు.

ఇక అజిత్ కొంతకాలంగా గాయంతో బాధపడుతున్నారు. తన కాలుకు అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ తరువాత ఈ చారిత్రక కథా చిత్రంలో నటిస్తారని కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం.

English summary
Director Vishnuvardhan has joined hands with noted novelist and screenwriter Balakumaran to film one of his historical stories. It is now rumored the story deals with the building of the Thanjavur Temple during the times of Raja Raja Cholan. Vishnuvardhan is said to be keen on casting his favourite hero Thala Ajith as the great Chola King.
Please Wait while comments are loading...