»   » సురివా.... అంటూ కోలీవుడ్ పిచ్చెక్కిపోతోంది: సెన్సేషనల్ గా వివేగం సాంగ్

సురివా.... అంటూ కోలీవుడ్ పిచ్చెక్కిపోతోంది: సెన్సేషనల్ గా వివేగం సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అజిత్ తాజా చిత్రంగా రూపొందుతోన్న 'వివేగం' సినిమా కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 10న గానీ 11వ తేదీన గాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీరం - వేదాళం తర్వాత డైరెక్టర్ శివ - హీరో అజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మ్యూజిక్ పైన సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగింది.

వివేగం

వివేగం

వివేగం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ లో చూపించిన హీరో అజిత్ సిక్స్ ప్యాక్ లుక్ ఒరిజినల్ కాదని.. వీఎఫెక్స్ ద్వారా సిక్స్ ప్యాక్స్ సృష్టించారని యాంటీ ఫ్యాన్స్ అప్పట్లో చేసిన రచ్చతో సోషల్ మీడియాలో చాలా చర్చ జ‌రిగింది. ఐతే ఈ లుక్ గురించి వ‌చ్చిన‌ చర్చను మళ్లించేందుకు వివేగం టీం తర్వాత రెండు లుక్స్ రిలీజ్ చేసింది కానీ.. అవేమంత కిక్కు ఇవ్వలేదు.

'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్

'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్

ఈ నేపథ్యంలో వివేగం టీజర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ప్పుడు ఈ టీజ‌ర్ ఇంకెంత కామెడీగా ఉంటుందో అంటూ సెటైర్స్ వేసారు.కానీ టీజర్ తెచ్చిన సునామీముందు ఈ విమర్శలన్నీ కొట్టుకు పోయాయి. 'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నాడు.

‘సురివా' పాట

‘సురివా' పాట

‘సురివా' అనే పాటతో ఇప్పుడు రచ్చ చేస్తున్నాడు అజిత్. ఇంగ్లిష్ తమిళ్ కలిపి యూత్ కి కిక్ ఇచ్చేలా పాటకు ట్యూన్ ఇవ్వడంలో అనిరుధ్ ఆరితేరాడు అనే చెప్పాలి. ఇప్పుడు ఈ పాట కూడా అంతే ఎనర్జీతో ఇచ్చి అభిమానులును ఉత్సాహం రెట్టింపు చేశాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘సురివా' పాటను తన స్టూడియోలో పాడుతూ అందరికీ వినిపించాడు.

ఇంగ్లీష్ - తమిళ పదాలతో

ఇంగ్లీష్ - తమిళ పదాలతో

ఇంగ్లీష్ - తమిళ పదాలతో కలగలిపి ఉన్న లిరిక్స్తోఉన్న ఈ పాట ట్యూన్ పాడుకోవడానికి సులువుగా ఉండటంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో విడుదల చేసిన కొద్దిసేపటికే యూట్యూబ్ లో దాదాపు 10 లక్షల వ్యూలు వచ్చాయి. పూర్తి పాటను జూన్ 19న విడుదల చేస్తారు అని చెబుతున్నారు.

అనిరుధ్‌ సంగీతం

సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అక్షర హాసర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ రిలీజ్ అయిన పది గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్సేషన్ సృష్టించిన వివేగం, టీజర్ తోనూ అదే హవాచూపించింది.., ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టు కుంటోంది.

English summary
The makers of upcoming Tamil action-thriller Vivegam, starring Ajith Kumar, released the Song Suriva...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu