»   » దర్శకుడు శంకర్‌ నెక్ట్స్ చిత్రం హీరో ఖరారు

దర్శకుడు శంకర్‌ నెక్ట్స్ చిత్రం హీరో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Director Shankar
చెన్నై : తమిళ,తెలుగులో దర్శకుడు శంకర్ చిత్రాలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులను ఎప్పుడూ నిరాశపరచని రీతిలో ఆయన చిత్రాలు,సామాజిక సందేశాన్ని జోడించి మరీ వదులుతూంటారు. ప్రస్తుతం విక్రమ్ తో ఐ(మనోహరుడు)చిత్రం షూటింగ్ పూర్తి చేసి,రిలీజ్ కు సిద్దం చేస్తున్న శంకర్ తన తదుపరి చిత్రానికి హీరోని ఖరారు చేసారని కోలీవుడ్ సమాచారం. ఆ హీరో మరెవరో కాదు వరస హిట్స్ తో దూసుకుపోతున్న అజిత్.

అజిత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతోందని అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎప్పటినుంచో అజిత్‌తో శంకర్‌ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'రోబో'లో అజిత్‌ నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కథ షారుక్‌ఖాన్‌కు, తర్వాత రజనీకాంత్‌ వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 'వీరం' విజయంతో ఉన్న అజిత్‌.. ప్రస్తుతం గౌతం మీనన్‌ దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటిస్తున్నాడు.

ఆ తర్వాత 56వ చిత్రం కేవీఆనంద్‌, 57వ చిత్రం విష్ణువర్థన్‌, శివ దర్శకత్వంలో 58వ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గౌతం మీనన్‌ సినిమా పూర్తయ్యాక శంకర్‌ సినిమాలో నటించనున్నట్లు తాజా సమాచారం. ఇటీవల శంకర్‌ చెప్పిన కథ అజిత్‌కు నచ్చడంతో ఓకే చెప్పారట 'తల'. దీంతో ఇందులో అజిత్‌ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారని, ఆయనకు జంటగా నటిస్తున్న ఐశ్వర్య సైతం ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం.

స్టార్‌ హీరోలతో సమానంగా పేరు సంపాదించుకున్న దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు శంకర్‌. భారీతనం, వైవిధ్యం కలగలిపితే శంకర్‌ అనుకోవచ్చు. సినిమా సినిమాకీ కొత్తదనాన్ని చూపిస్తూ వస్తున్నారాయన. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం 'ఐ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులో 'మనోహరుడు'గా తీసుకొస్తున్నారు. విక్రమ్‌, అమీ జాక్షన్‌ జంటగా నటిస్తున్నారు. ఆస్కార్‌ ఫిలింస్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు.

శంక‌ర్ రోబో మూవీ వ‌చ్చి మూడు సంవ‌త్సరాలు అవుతున్నా, శంక‌ర్ డైరెక్షన్ నుండి ఆ రేంజ్ మూవీ ఇప్పటి వ‌ర‌కూ రాలేదు. మ‌ధ్యలో స్నేహితుడు మూవీను తీసినా అది కోళీవుడ్‌లోనూ అంతంత మాత్రంగా విజ‌యం సాధించింది. తెలుగులో అయితే స్నేహితుడు మూవీను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో శంక‌ర్ ఫుల్ మార్క్ ఉన్న ఫిల్మ్‌గా ఐ చిత్రం క్రేజ్ సంపాందించుకుంది.

English summary
Shankar has plans to direct an action thriller with Ajith Kumar. The talks are on and the project is likely to be materialised. It is said that Thala was impressed by the narration and the Arrambam star has given green signal for the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu