»   » విజయ్‌ 'తలైవా' విడుదల తేదీ ఖరారు

విజయ్‌ 'తలైవా' విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : విజయ్‌ తాజా చిత్రం 'తలైవా'. 'మదరాసపట్టిణం' ఫేం విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పాటలకు జనం నుంచి ఆదరణ లభిస్తోంది. 'తుప్పాకి' తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అమలాపాల్‌ హీరోయిన్. సత్యరాజ్‌, సంతానం, రాజీవ్‌పిలె, సురేష్‌ తదితరులు నటించారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం సమకూర్చారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ కథతో తెరకెక్కింది. వచ్చేనెల 9న తెరపైకి రానుంది.


విజయ్‌ అమలాపాల్‌ నటించిన తమిళ చిత్రం 'తలైవా' చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తికానందున తేదీని మళ్లీ మార్చారు. జూలైలో విడుదలకు పంపిణీదార్లు కూడా అంగీకరించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కానందున వాయిదావేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 9న విడుదల చేయడానికి నిర్ణయించారు.

నిర్మాత ఎస్.చంద్రప్రకాష్ జైన్ మాట్లాడుతూ....నటుడు విజయ్ సహకారం మరువలేనిదన్నారు. తాను ఇంతకుముందు కొన్ని హిట్ చిత్రాలను నిర్మించానన్నారు. కొంత విరా మం తీసుకుని నిర్మించిన చిత్రం తలైవా అని పేర్కొన్నారు. మళ్లీ చిత్రాన్ని నిర్మించాలని భావించినప్పుడు విజయ్‌ను కాల్‌షీట్స్ అడిగానన్నారు. ఆయనతో చిత్రాలు నిర్మించడానికి ఎందరో ప్రముఖ నిర్మాతలు క్యూలో ఉండగా తనకు కాల్‌షీట్స్ ఇస్తారని ఊహించలేదన్నారు.

విజయ్ నుంచి ఏమి సమాధానం వస్తుందోనన్న సంకోచంతోనే వెళ్లి కలిశానన్నారు. తదుపరి చిత్రం మీదే చేస్తున్నానని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయూనన్నారు. చిత్ర షూటింగ్ సిడ్నీలో నిర్వహించినప్పుడు విజయ్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. విజయ్ మాట్లాడుతూ తలైవా చిత్రాన్ని తాను చూశానని, చాలా బాగా వచ్చిందని, తన అభిమానులకు నచ్చుతుందని తెలిపారు

జి.వి.ప్రకాష్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌. ఈయన గతంలో రూపొందించిన 'కిరీడం, మదరాస పట్టినం, తిరుమగళ్‌' చిత్రాలు ప్రేక్షదాకరణ పొందాయి. తలైవా చిత్రంలో సత్యరాజ్‌, రాగిణి నంద్వాని, రాజీవ్‌ పిళ్లయ్‌, అభిమాన్యుసింగ్‌, సురేష్‌ ముఖ్యపాత్రధారులు. సినిమా తమిళనాడు హక్కులను వేందర్‌ మూవీస్‌ సొంతం చేసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో అయ్యంకరన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ విడుదల చేస్తోంది.

English summary
Vijay’s much awaited Thalaivaa Release Date has now been confirmed. Thalaivaa will hit the screens world wide on August 9th. Directed by A.L Vijay Thalaivaa features Vijay and Amala Paul in lead roles. Thalaivaa Trailer which was released recently has already created a huge buzz and it has already crossed 2.2 million views on you tube. Thalaivaa audio was released recently and the songs have already been a huge hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu