»   » యంగ్ హీరోకు సూపర్‌ స్టార్‌ ఫోన్‌ చేశారు! ఫుల్ హ్యాపీ

యంగ్ హీరోకు సూపర్‌ స్టార్‌ ఫోన్‌ చేశారు! ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ నుంచి ఫోన్ వస్తే ఆ ఆనందం అందరికీ చెప్పుకోవాలనిపించటం సహజం. అందుకు నిర్మాతలు, హీరోలు మరెవరూ అతీతులు కారు. రీసెంట్ గా తమిళ నటుడు శివకార్తికేయన్‌కు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఫోన్‌ చేశారట. శివకార్తికేయన్‌, కీర్తీసురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'రెమో'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లతో నడుస్తోంది.

ఈ చిత్రాన్ని చూసిన రజనీ నిర్మాత ఆర్డీ రాజాకు, హీరో శివకార్తికేయన్‌కు ఫోన్‌ చేసి అభినందించారట. నిర్మాత తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

రజనీకి తాను వీరాభిమానినని, ఇది తన జీవితంలో పడ్డకష్టానికి ప్రతిఫలంగా పొందిన విజయమని సూపర్‌స్టార్‌కి ధన్యవాదాలు తెలిపారు. 'రెమో' చూసిన తర్వాత సూపర్‌స్టార్‌ తనకు, శివకార్తికేయన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారని, ఆయనకు సినిమా చాలా నచ్చిందని ట్వీట్‌ చేశారు.

తమిళ యంగ్ హీరో శివకార్తీకేయన్ లీడ్ రోల్ లో నటిస్తున్న రెమో రీసెంట్ గా దసరా కానుకగా రిలీజైంది. నటుడు కావలనుకునే వ్యక్తి ఓ దర్శకుణ్ని ఆకట్టుకోవటం కోసం ఆడవేషం వేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కింది.

శివకార్తీకేయ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అట్లీ శిష్యుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించాడు. రజనీ మురుగన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శివకార్తీకేయన్, ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ సాధించాడని తమిళ మీడియా అంటోంది.

Thalaivar Rajinikanth heaps praise on Sivakarthikeyan's Remo

ఈ చిత్రం తెలుగు వెర్షన్ విషయానికి వస్తే...స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురానున్నాడు. ఓకె బంగారం సినిమాను తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం సాధించిన రాజు, ఈ సారి రెమో టైటిల్ తో ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు.

తమిళనాట వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ రెమో. హీరో లేడి నర్స్ గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నేను శైలజ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ సాధించిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన మేడం సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో రెమో కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు దిల్ రాజు. తెలుగులో కూడా రెమో పేరుతోనే రిలీజ్ కానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

English summary
“After watching Remo superstarrajini sir called me and Siva_Kartikeyan and congratulated us. He liked Remo very much and praised a lot. As an ardent fan of Rajini sir, it's a great acknowledgement and achievement in my life time for all the hard work. Thank u very much sir”, wrote RD Raja on his Twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu