అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. #Beastగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ !
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. రేపు(జూన్ 22) ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ సన్ పిక్చర్స్ నిన్ననే ప్రకటించింది. దీంతో ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచే #Thalapathy65FirstLook పేరుతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్స్ కూడా చేశారు. జూన్ 21 సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ లుక్ వస్తోందంటూ ప్రకటించినట్టు గానే విజయ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సినిమా ప్రకటించారు.
ఇక ముందు నుంచి ఈ సినిమాకి బులెట్, ట్రిగ్గర్ అనే కొన్ని పేర్లు వినిపించినా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు బీస్ట్ అనే పేరు అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో విజయ్ వైట్ బనియన్ తో, బ్లాక్ పాంట్ తో గన్ తీసుకుని సీరియస్ లుక్ లో ఉన్నట్టు చూపించారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీకలో విజయ్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఇక చానాళ్ళ తరువాత ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్న ఈ సినిమాను సన్ పిక్షర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో బీబత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇక మరో పక్క ఈ సినిమా తరువాత తెలుగులో కూడా విజయ్ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రకటన కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నా ఇప్పటిదాకా ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది అని చెప్పచ్చు.


Click it and Unblock the Notifications











