»   » నిజమేనా? :రామ్ చరణ్ కాదు మహేష్ తో

నిజమేనా? :రామ్ చరణ్ కాదు మహేష్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వారం క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో మరో టాక్ వినపడుతోంది. ఈ చిత్రాన్ని మహేష్ చేయటానికి ఇంట్రస్ట్ చూపెడుతున్నాడని అంటున్నారు. కొద్ది పాటి మార్పులతో తెలుగులో చేయాలని దర్శకుడు తో అన్నట్లు చెప్పుకుంటున్నారు.

తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి...నిన్న ఆదివారం నాడు మహేష్ ఈ చిత్రాన్ని చూసారని, చాలా ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. అయితే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్స్ కేటాయించనప్పటికీ మహేష్ ఈ సినిమా నిర్మాణంలో అయినా పాలు పంచుకునే అవకాసం ఉందని చెప్తున్నారు. దర్శకుడు కూడా మహేష్ తప్ప మరొకరు న్యాయం చేయలేరు అన్నట్లు గా భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నార.

తమిళంలో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ రైట్స్ తీసుకుని చేయటం అనాదిగా జరుగుతున్న విషయమేతమిళంలో డైరక్ట్ చేసిన డైరక్టర్ రాజానే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. నిర్మాత ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'Thani Oruvan' remake :Mahesh Babu In, Ram Charan Out!

కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు సోదరులు జయంరాజా, రవి. దర్శకుడు, నటుడిగా ఇప్పటి వరకు రీమేక్‌ చిత్రాలతో వచ్చిన వీరు.. తొలిసారిగా 'తని ఒరువన్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్‌గానూ ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది. నయనతార, అరవింద్‌స్వామి, నాజర్‌, తంబిరామయ్య తదితరుల నటన కూడా సినిమాకు ప్లస్‌పాయింట్‌గా మారింది. చిత్ర విజయోత్సవ వేడుక చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

జయంరాజా మాట్లాడుతూ.. ''నా వద్దకు వచ్చే నటులందరూ రీమేక్‌ చిత్రాలను తెరకెక్కిస్తే చేయడానికి సిద్ధమే అంటున్నారు. ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ.. నన్ను నేరు చిత్ర దర్శకుడిగా ఎవరూ గుర్తించలేదు. నేను ఆ స్థాయివాణ్ని కాకపోయినప్పటికీ.. సొంతంగా సినిమాకు దర్శకత్వం వహించగలను. ఆ నమ్మకంతోనే 'తని ఒరువన్‌'తో తొలివిత్తు నాటాను. ఇప్పుడు అది మహావృక్షంగా నాకు ఎనలేని సంతోషాన్ని పంచుతోంది''అని ఉద్వేగానికి గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న తమ్ముడు జయంరవికి కూడా కళ్లు చెమ్మగిల్లాయి.

అనంతరం జయంరవి మాట్లాడుతూ.. ''గతంలో నా విజయాన్ని చూసి అన్న గర్వపడేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రీమేక్‌ చిత్రాలన్నీ నాకే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దర్శకుడిగా ఆయన గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మా అన్న చాలా సీరియస్‌ దర్శకుడన్న విషయం ఈ చిత్రం ద్వారా తేటతెల్లమైంద''ని చెప్పారు.

English summary
Mahesh has seen the Thani Oruvan film on Sunday and he is quite impressed with the slick action thriller. Thani Oruvan (TO) directed by Mohan Raja starring Jayam Ravi and Nayanthara in the lead, released last Friday and is creating huge ripples at the box office.
Please Wait while comments are loading...