»   » రామ్ చరణ్ తోనే రీమేక్ ఖరారు...పూర్తి డిటేల్స్

రామ్ చరణ్ తోనే రీమేక్ ఖరారు...పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది రోజుల క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అని తెలుస్తోంది. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేటట్లు ఒప్పందం కుదిరింది. అలాగే దర్శకుడుకి రెమ్యునేషన్ ఐదు కోట్లు మించకుండా ఉండాలని కండీషన్ పెట్టినట్లు, అంతేకాకుండా మొత్తం బడ్జెట్ 25 కోట్లు లోపల అవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం 8-9 కోట్లు వరకూ అడిగారని, అయితే నిర్మాత ఎన్.వి ప్రసాద్ కు ఉన్న రిలేషన్ తో ఈ ప్రాజెక్టుని ఫైనల్ అయినట్లు చెప్తున్నారు. 

'Thani Oruvan' remake :Ram Charan's costs Rs 5.5 crore


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు సోదరులు జయంరాజా, రవి. దర్శకుడు, నటుడిగా ఇప్పటి వరకు రీమేక్‌ చిత్రాలతో వచ్చిన వీరు.. తొలిసారిగా 'తని ఒరువన్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్‌గానూ ఈ చిత్రం వసూళ్లు రాబడుతోంది. నయనతార, అరవింద్‌స్వామి, నాజర్‌, తంబిరామయ్య తదితరుల నటన కూడా సినిమాకు ప్లస్‌పాయింట్‌గా మారింది. చిత్ర విజయోత్సవ వేడుక చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

జయంరాజా మాట్లాడుతూ.. ''నా వద్దకు వచ్చే నటులందరూ రీమేక్‌ చిత్రాలను తెరకెక్కిస్తే చేయడానికి సిద్ధమే అంటున్నారు. ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ.. నన్ను నేరు చిత్ర దర్శకుడిగా ఎవరూ గుర్తించలేదు. నేను ఆ స్థాయివాణ్ని కాకపోయినప్పటికీ.. సొంతంగా సినిమాకు దర్శకత్వం వహించగలను. ఆ నమ్మకంతోనే 'తని ఒరువన్‌'తో తొలివిత్తు నాటాను. ఇప్పుడు అది మహావృక్షంగా నాకు ఎనలేని సంతోషాన్ని పంచుతోంది''అని ఉద్వేగానికి గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న తమ్ముడు జయంరవికి కూడా కళ్లు చెమ్మగిల్లాయి.

అనంతరం జయంరవి మాట్లాడుతూ.. ''గతంలో నా విజయాన్ని చూసి అన్న గర్వపడేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రీమేక్‌ చిత్రాలన్నీ నాకే గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దర్శకుడిగా ఆయన గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మా అన్న చాలా సీరియస్‌ దర్శకుడన్న విషయం ఈ చిత్రం ద్వారా తేటతెల్లమైంద''ని చెప్పారు.

English summary
As per Industry buzz, Telugu remake rights of 'Thani Oruvan' have been obtained by Ram Charan for Rs 5.5 crore. That too the deal was closed with the condition Mohan Raja who directed the original will wield the megaphone for Telugu version as well.
Please Wait while comments are loading...