30 సంవత్సరాలుగా ఆ అమ్మాయి కోసం రజనీకాంత్ ఎదురుచూపు
రజనీ మాట్లాడుతూ.. తాను చెన్నైలోని కృష్ణ వేణి థియోటర్ లో అపూర్వ రాగంగళ్ చిత్రం విడుదలైనప్పుడు చూడ్డానికి, ప్రేక్షకుల రెస్పాన్స్ గమనించటానికి వెళ్లానని, అప్పుడో చిన్న పాప తన వద్దకు వచ్చి తాను అభిమాని ని అని ఆటోగ్రాఫ్ తీసుకుందని చెప్పారు. అయితే అప్పుడు ఆమె వద్ద ఆటోగ్రాఫ్ పుస్తకం ఏమీ లేదని, కేవలం ఆమె దగ్గర ఉన్న చిత్రం టిక్కెట్ వెనక తాను సంతకం పెట్టి ఇచ్చానని, అది తనకు జీవితాంతం గుర్తు ఉంటుందని అన్నారు. తను మొదట ఇచ్చిన ఆటోగ్రాఫ్ పొందిన ఆమెను మళ్లీ చూడాలని ముప్పై సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నానని, కనపడలేదని అన్నారు.
''కన్నా.. నాన్ ఎప్పొవరువ. ఎప్పడి వరువను యారుక్కుం తెరియాదు. ఆనా వరవేండియ టైంకు కరెక్టా వందురువ''... - 'నరసింహా' చిత్రం రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఇది. 'నేను ఎప్పుడొస్తాను. ఎలా వస్తానని ఎవరికీ తెలియదు. కానీ రావాల్సిన సమయానికి కరెక్టుగా వచ్చేస్తా'నన్నదే దానర్థం. సినిమాలోనే కాదు నిజజీవితంలోనూ రజనీ ఈ స్త్టెల్‌ను ఫాలో అయ్యారు ఈ సారి. 'అసలు నేనెందుకు పుట్టానా?' అని తన పుట్టినరోజు ఏకాంతంలో ఉంటూ ఆలోచించే రజనీకాంత్.. తన 63వ పుట్టినరోజున అభిమానులకు షాకిచ్చారు. 'తలైవా..' అంటూ మిన్నంటుతున్న నినాదాల తరుణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షమయ్యారు. అందరికీ అభివాదం చేశారు. అంతేకాదు.. వారినుద్దేశించి.. ప్రసంగం కూడా చేశారు. అంతేనా.. అభిమానుల కర్తవ్యాన్ని కూడా గుర్తు చేశారు. వెరసి.. 'దటీజ్ సూపర్‌స్టార్' అనుపించుకున్నారు.


Click it and Unblock the Notifications












