For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంతకన్నా ఏమి అడగను:ధనుష్ ...రజినీ, సౌందర్య, ధనుష్ (ఫొటోలివే)

  |

  సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ సౌందర్య రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమాతో డైరెక్టర్ గా మారి ఇప్పుడు ధనుష్ తో వీఐపీ2 సీక్వెల్ తీయాలనుకున్న సంగతి తెలిసిందే. కబాలి నిర్మాత కలైపులి థాను తో పాటు వార్డ్ రోబ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. వేలైఇల్లా పట్టాతారై(విఐపి) చిత్రం అప్పట్లో సూపర్ హిట్ విజయం సాధించగా.

  ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వీఐపీ2 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, ఈ మధ్య చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా యూనిట్ సమక్షంలో ధనుష్ పై మొదటి క్లాప్ ఇచ్చి చిత్ర షూటింగ్ ప్రారంభించారు రజినీకాంత్.

  ధనుష్ తన ట్విట్టర్ ద్వారా:

  ధనుష్ తన ట్విట్టర్ ద్వారా:

  ట్విట్టర్ లోను వీఐపీ 2 టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు సూపర్ స్టార్. రజినీ ఆశీర్వాదంతో మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని వీలైనంత త్వరలోనే విడుదల కానుందట. రజినీ ఆశీస్సులు వీఐపీ టీంకి దక్కడంతో ఈ ఆనందాన్ని ధనుష్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

  తెలుగులో రఘువరన్ బిటెక్ :

  తెలుగులో రఘువరన్ బిటెక్ :

  ఇంతకు మించి తలైవాని ఏం అడుగగలను..ఆశీర్వదించడానికి వచ్చిన సూపర్ స్టార్ కి కృతజ్ఞతలు. మీ అందరి బ్లెస్సింగ్ తో సీక్వెల్ మూవీ ఈ రోజు ప్రారంభమైంది అని ట్వీట్ చేశాడు. వీఐపీ చిత్రం 2004లో విడుదల కాగా తెలుగులో రఘువరన్ బిటెక్ టైటిల్ తో విడుదలై ధనుష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

  ధనుష్‌ కథానాయకుడిగా :

  ధనుష్‌ కథానాయకుడిగా :

  ఇప్పుడు తెలుగులోను విఐపి2 టైటిల్ తోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ధనుష్‌ కథానాయకుడిగా 2014లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన 'రఘువరన్‌ బీటెక్‌' ధనుష్ కి తెలుగు మార్కెట్ లో కూడా

  ఇష్టపడ్డ అమ్మాయి:

  ఇష్టపడ్డ అమ్మాయి:

  ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాని కుర్రాడి పరిస్ధితి ఎలా ఉంటుంది...తన ఇంట్లో తన తమ్ముడు సైతం ఎమ్ సి ఎ చదివి ఉద్యోగం సంపాదించి తన ఎదురుగా తిరుగుతూంటే ఏం చేయాలి...తను ఇష్టపడ్డ అమ్మాయి తన కన్నా ఎక్కువ సంపాదిస్తూ కారులో తిరుగుతూంటే ఎలా పడేయగలడు...

  ఇవన్నీ

  ఇవన్నీ

  ఇవన్నీ చాలా మంది నేటి కుర్రాళ్ల రెగ్యులర్ సమస్యలే. వీటిన్నటినీ గుది గుచ్చి...యూత్ ను కనెక్టు చేస్తూ తమిళ భాక్సాఫీస్ ని కొల్లగొట్టేసాడు ధనుష్. అదే సినిమాని తెలుగులోకి దించారు. అయితే అక్కడక్కడా తమిళ వాసన కనిపించే ఈ చిత్రం మన కుర్రాళ్లకూ బాగానే కిక్ ఇచ్చింది.

  తెలుగులో పెద్ద మార్కెట్ లేదు:

  తెలుగులో పెద్ద మార్కెట్ లేదు:

  ప్రస్తుత సమాజంలో లో ఉన్న కుర్రకారు ఎదుర్కొంటున్న సీరియస్ పాయింట్ ని చక్కటి ఎంటర్టైన్మెంట్ తో కలిపి వండిన స్క్రిప్టు అప్పట్లో బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాకి ముందు ధనుష్ కి తెలుగులో పెద్ద మార్కెట్ లేదు, అదివరకూ కొన్ని సినిమాలని తెలుగులోకి తెచ్చినా రఘువర్ణ్ సినిమానే తెలుగులో దనుష్ కి వచ్చిన మొదటి హిట్ అని చెప్పుకోవాలి.

  చేస్తే ఇంజినీరుగానే చేయాలని:

  చేస్తే ఇంజినీరుగానే చేయాలని:

  రఘువరన్...! బిటెక్ పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా చేస్తే ఇంజినీరుగానే చేయాలని ఖాలీగా ఉన్న నిరుద్యోగి. ఓ ప్రక్క ఎమ్ సి ఎ చదువుకున్న తన తమ్ముడు సెటిల్ అవుతున్నా అతను మాత్రం తన పట్టుదల విడువడు.

  తల్లి చనిపోతుంది:

  తల్లి చనిపోతుంది:

  అతనికి ఇంట్లో తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నా తల్లి పూర్తి సపోర్టు ఇస్తూంటుంది.ఈ లోగా...అతని ఇంటి ప్రక్కన శాలిని దిగుతుంది. ఆమెతో మొదట పరిచయం తర్వాత ప్రేమ మొదలువుతాయి. అయితే ఈ లోగా ఊహించని విధంగా అతని నిర్లక్ష్యం వల్ల తల్లి చనిపోతుంది.

  లవ్ మ్యాటర్ ఏమైంది:

  లవ్ మ్యాటర్ ఏమైంది:

  మరో ప్రక్క అనిత వల్ల అతనికి సివిల్ ఇంజినీరుగా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాడు. మరో ప్రక్క కార్పోరేట్ యజమాని అరుణ్ అతని ఎదుగుదలకు అడ్డం పడుతూంటాడు. అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు...ఇంతకీ అనిత ఎవరు... అతని తల్లి ఎందుకు చనిపోయింది...షాలినీతో లవ్ మ్యాటర్ ఏమైంది. వంటి విషయాలని కలుపుకొని తీసిన సినిమా కావటం తో భాష, నేటివిటీ సమస్యలని దాటి మంచి విజయాన్ని అందుకుంది.

  రఘువరణ్ బీటెక్ 2 అని కాకుండా :

  రఘువరణ్ బీటెక్ 2 అని కాకుండా :

  ఇప్పుడు ఈ వీఐపీ 2 ని కూడా తెలుగులోకి తెచ్చే ప్రయత్నం లోనే ఉన్నారు, అయితే ఈ సారి టైటిల్ మాత్రం రఘువరణ్ బీటెక్ 2 అని కాకుండా తమిళ వెర్షన్ టైటిల్ అయిన వీఐపీ 2 అనే ఉంచేస్తారట. అయినా పేరేదైతేనేం... మనకు కంటెంట్ బాగుండాలంతే..

  English summary
  Rajinikanth launched Velaiyilla Pattathari sequel, starring Dhaunsh, with traditional mahurat clap.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X