»   »  నమితా..ఒక్కసారి మాతో ప్లీజ్ !!

నమితా..ఒక్కసారి మాతో ప్లీజ్ !!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
భారీ అందాల నమితకు తమిళంలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఓ సంఘటన ఆమె తాజా చిత్రం ధీ(Thee) ప్రెస్ మీట్ లో జరిగింది. ఆపరేషన్ దుర్యోధన రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలు(తెలుగులో ముమైత్ చేసింది) పాత్రను చేస్తోంది. దర్శక,హీరో సుందర్.సి (ఖుష్భూ భర్త) రివెంజ్ తీర్చుకునే పోలీస్ ఆఫీసర్ పాత్ర ( తెలుగులో శ్రీకాంత్ చేసింది) చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఓ రూరల్ ఏరియాలో తీసారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక చివరి రోజు ప్రెస్ మీట్ ఎరేంజ్ చేసారు.

ఇక ప్రెస్ మీట్ ప్రారంభమైన దగ్గరనుండీ వచ్చిన వారందరీ దృష్టీ నమితపైనే ఉంది. ఎందుకంటే తెలుగులో ముమైత్ ఆ పాత్రలో లీనమై ఓ రేంజిలో ఎక్స్ పోజింగ్ చేసి సినిమాను నిలబెట్టింది. అందులోనూ పోస్టర్స్ లోనూ నమిత హాట్ గా ఉండేటట్లు డిజైన్ చేసారు. దాంతో ప్రెస్ మీట్ లో అంతా నమిత పాత్ర గురించే గుచ్చి గుచ్చి అడిగారు. అంతేగాక సుందర్ .సి సినిమా గురించి చెప్పబోతుంటే నమితను మాట్లాడమని గోలచేసారు. ఎందుకంటే నమిత మాట్లాడింది తీసుకెళ్ళి టీవీ తెరపై కనపడితే టీఆర్ పీలు పెర్గుతాయి అని వారి ఉద్దేశం.

అందులోనూ ఆ రోజు నమిత ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో వచ్చి కేక పుట్టించింది. దాంతో అక్కడి చేరిన వారందరికీ మతి పోయింది. ఇదంతా చూసిన సుందర్.సి తన సినిమా గ్యారెంటీ హిట్టని ఓ ప్రక్కన మురిసిపోతూనే మరోప్రక్క తనని ఎవరూ పట్టించుకోనందుకు భాధ పడ్డాడు. చివరలో నమిత మాట్లాడటం పూర్తయ్యాక ఇంకేమన్నా అడిగేది ఉందా అడిగారు. దానికి వారు ఒక్కసారిగా నమితా..ఒక్కసారి ప్లీజ్ అంటూ ఆమె ఆటోగ్రాఫ్ లు,తమతో ఫొటోలు కావాలని అడిగారు. నమిత గర్వంగా యూనిట్ వారివంకా చూస్తూ ఆ పనిలో పడిపోయింది. దాంతో మీడియాలోనూ ఆమె పట్ల ఉన్న అభిమానానికి,ప్రేమకి ఆశ్చర్యపోవటం అందరి వంతయింది.

ఇది చూసిన వారు అయినా ఆ హీరో పిచ్చిగానీ నమిత కోసం ఆ సినిమా తీసారు...తర్వాత జనం ఆమె కోసమే చూస్తారు గానీ కథ,హీరో అనేది ఎవరికి కావాలి అని అంతా కామెంట్స్ చేసుకున్నారు. కరెక్టే కదా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X