»   » ఆ డైరక్టర్ ఓ సినిమా పిచ్చోడు: జెడీ చక్రవర్తి

ఆ డైరక్టర్ ఓ సినిమా పిచ్చోడు: జెడీ చక్రవర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివ సినిమాతో పరిచయమై సత్యతో అందనంత ఎత్తుకు ఎదిగిన జెడి చక్రవర్తి మొన్నామధ్య తమిళంలో సర్వం అనే చిత్రం చేసారు. విపరీతమైన అంచనాలతో వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చనిపోయిన తన కుమారుడు మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నించే ఓ విచిత్రమైన పాత్రని ఈ చిత్రంలో జెడీ చేసారు. అయితే ఇంటర్వెల్ కే హీరోయిన్ త్రిష చనిపోవటం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో సినిమా ఫెయిల్యూర్ అవటం జెడీ నిరాశలో మునగటం జరిగింది. దానికి తోడు తెలుగులో అతను చేసిన జోష్ చిత్రం కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఈ రెండు ఫెయిల్యూర్స్ ని దృష్టిలో పెట్టుకుని చాలా సెలక్టివ్ గా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే మొదట కచేరి ఆరంభం అనే చిత్రాన్ని రిజెక్టు చేసారు. అయితే దర్శకుడు తిరువన్నమ్ పట్టుదల పట్టి కథ వినిపించి ఒప్పించారు. ఈ విషయమై జె డీ చెప్తూ...నేను అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ ఆ దర్శకుడు కథ చెప్తానంటే మొహమాటానికి ఒప్పుకున్నా. అతను చెప్పిన విధానం, నేరేషన్ సింపుల్లీ అవుట్ స్టాండింగ్. మీరు నమ్మరు...నేను కొద్ది క్షణాలు పాట శ్వాస కూడా తీసుకోవటం మర్చిపోయానా అనిపించింది. అవును...కాదు అన్నది కూడా చెప్పలేకపోయాను. ఆ డైరక్టర్ ఓ సినిమా పిచ్చోడు అన్నారు. జీవా, పూనం బజ్వా కాంబినేషన్ లో వస్తున్న ఈ తమిళ సినిమా పేరు కచేరీ ఆరంభం. ఇక సర్వం చిత్రం ఫెయిల్యూర్ పై విశ్లేషిస్తూ...నాకు ఫ్లాప్ అనేవి కొత్తేం కాదు. అలాగే నేను ఎప్పుడూ బాధ పడనూ లేదు. కానీ ఆ సినిమాను దర్శకుడు విష్ణు వర్ధన్ కోసం చేసాను. దాంతో ఆ సినిమా పోవటం కాస్త పర్శనల్ గానే బాధించింది. బహుశా నాకు విష్ణు వర్ధన్ మీద ఉన్న నమ్మకం, ఇష్టం కారణంగా అనిపించి ఉండవచ్చు అన్నారు. ఇక సర్వం చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్ చేసి త్వరలో రిలీజ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu