For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ తో 'అన్నా' అని పిలువద్దని చెప్పా

  By Srikanya
  |
  చెన్నై : 'యాన్‌' షూటింగ్ తొలిరోజున నన్ను 'అన్నా' అని పిలిచింది. ఒక్కసారిగా అదిరిపోయాను. 'చూడమ్మా.. అన్న అని పిలవకూడదు' అని నిబంధన విధించాను అంటున్నారు జీవా. జయాపజయాలతో నిమిత్తం లేకుండా జనాలను థియేటర్లకు పెద్దసంఖ్యలో రప్పించే యంగ్ హీరోల్లో జీవా ఒకరు. 'రంగం'లో కార్తీకతో జట్టుకట్టిన జీవా ప్రస్తుతం 'యాన్‌'లో కార్తీక చెల్లెలు తులసి సరసన ఆడిపాడుతున్నాడు. ఈ సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

  'రంగం'లాంటి సంచలన విజయాన్ని అందుకుని స్టార్ హీరో స్ధాయికి ఎదిగినా, అనంతరం వరుస ఫ్లాప్ లతో కాస్త వెనకపడినా నటుడిగా మాత్రం ప్రతి చిత్రానికి తనస్థాయిని పెంచుకుంటూనే పోతున్నాడు. అలాగే హిట్,ప్లాప్ లతో సంభంధం లేకుండా వైవిధ్య పాత్రల్లో ఇకపై కూడా కనిపిస్తానని చెప్తున్నాడు.

  ఇక రామ్‌, కట్రదు తమిళ్‌ ఫలితాలు వ్యాపారం పరంగా ఎలా ఉన్నా నటుడిగా మాత్రం నన్ను ఓ మెట్టు పైకి తీసుకెళ్లాయి. నా కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. వైవిధ్య ప్రయోగాలు చేస్తున్నప్పుడు కొన్ని ఫలితాలు మనకు ప్రతికూలంగా రావొచ్చు. వాటికి భయపడి వెనక్కి తగ్గకూడదు. 19 ఏళ్ల వయసులో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇకపై కూడా ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకునేందుకుప్రయత్నిస్తాను అన్నారు.

  అక్క అంబిక, చెల్లెలు రాధకు జంటగా నటించాడు కమల్‌హాసన్‌. ఆయన తర్వాత అక్కాచెల్లెలితో కలిసి నటించిన హీరో నేనే. ఇదే విషయాన్ని ఇప్పటికే కొందరు నావద్ద ప్రస్తావించారు. ఎవరైతే ఏంటి, మనకు కావాల్సింది నటించటమే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కమల్‌హాసన్‌తో పోల్చి చెబుతుంటే మాత్రం గొప్పగా అనిపిస్తోంది. నాకూ అలాంటి అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

  కార్తీక, తులసిల గురించి... గురించి చెప్తూ... సహజంగా ఇంటికి పెద్దబిడ్డ అయితే కొంచెం పరిపక్వతతో, చిన్నవారు కొంచెం చిలిపితనంతో ఉంటారు. వీరి విషయంలో మాత్రం ఇది వ్యతిరేకంగా ఉందనే చెప్పాలి. కార్తీక సెట్స్‌లో ఎప్పుడూ నవ్వుల పువ్వులు పూయిస్తుంది. తులసి లెక్కించినట్లు అవసరమైన మేరకే మాట్లాడుతుంది అన్నారు.

  English summary
  Mani Ratnam’s Kadal heroine Thulasi Nair gets one more offer from Kollywood. Yes, she is going to pair with Jeeva in his upcoming flick Yaan directed by Ravi K Chandran. The makers are keen to rope in Kajal Agarwal for the film but when they heard the appreciations from none other than Mani Ratnam for her performanace in Kadal, they shifted to Thulasi, Karthika’s sister. The film is jointly produced by Elred Kumar and Jayaraman under RS Infotainment banner where Jeeva, Karthika and RS Infotainment team up for Kho directed by KV Anand is a blockbuster. Thulasi have replaced Karthika in the earlier team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X