twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మురగదాస్ 'తుపాకి' టైటిల్ వివాదం క్లియర్

    By Srikanya
    |

    చెన్నై: 'సెవెన్త్ సెన్స్' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం తుపాకి(తమిళంలో 'తుప్పాక్కి'). విజయ్‌, కాజల్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తొలుత టైటిల్ పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. షూటింగ్, నిర్మాణాంతర పనులు చివరిదశకు చేరుకున్నా ఆడియో విడుదల చేయలేని స్థితికి చేరుకుంది యూనిట్‌. 'కళ్ల తుప్పాక్కి' నిర్మాత రవిదేవన్‌ కోర్టులో కేసు వేయడమే అందుకు కారణం.

    తన టైటిల్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు ఉపసంహరించుకుంటున్నానని రవిదేవన్‌ చెప్పడంతో సమస్య పరిష్కారమైంది. 'తుప్పాక్కి'ని అనుకున్నట్టుగా దీపావళికి ప్రేక్షకుల కానుకగా తెచ్చేందుకు యూనిట్‌ సిద్ధమవుతోంది. ఒకట్రెండు వారాల్లో ఆడియో విడుదల ఉంటుందని సమాచారం. దాంతో దర్శక, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.

    సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'తుపాకి'. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

    ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. తమిళంలో 'మాళై నీరతు మళియతుల్లి" అనే టైటిల్‌ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు.

    ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా అధినేత సీజే శోభా చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్‌లా తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.

    English summary
    The four-month title drama of Thuppakki and Kallathuppakki has finally come to an end with both the parties deciding to have a conditional compromise. The makers of Kallathuppakki have withdrawn the case, thereby giving relief to the bosses of the Vijay's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X