twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లేమైనా బ్రోతల్సా? అలా అడిగిన నిర్మాతలను చంపాలనిపిస్తుంది: డైరెక్టర్ బాబ్జీ

    |

    ఎన్టీఆర్ నగర్, వేట కొడవళ్లు, రఘుపతి వెంకయ్య నాయుడు లాంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాబ్జీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చి నీచమైన పనులు చేస్తున్నారని, ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అన్నారు.

    సినిమా మీద పాషన్‌తో, ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి కళాత్మకమైన వ్యాపారం చేసుకుంటున్న పెద్దలు ఉన్నారు. డైరెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడటం లేదా మర్యాద పూర్వకంగా పిలిపించి ఇలా సినిమా చేద్దామనుకుంటున్నామండీ, కథలేమైనా ఉన్నాయా అని అడుగుతారు. కానీ ఈ మధ్య కొందరు చాలా నీచమైన ఆలోచనతో ఇండస్ట్రీకి వస్తున్నారని బాబ్జీ తెలిపారు.

    అలాంటి వారని చంపేయాలనిపిస్తుంది

    అలాంటి వారని చంపేయాలనిపిస్తుంది

    ‘‘రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి వస్తున్న ప్రొడ్యూసర్లు కొందరు... ఇండస్ట్రీకి వచ్చి వేస్తున్న వేషాలు చూస్తుంటే వారిని వెంటనే చంపేయాలనిపిస్తుంది. దర్శకులతో బ్రోకర్లతో మాట్లాడినట్లే మాట్లాడుతున్నారని'' బాబ్జీ చెప్పుకొచ్చారు.

    మాతో గడపటానికి ఎవరైనా హీరోయిన్లు ఉన్నారా? అని..

    మాతో గడపటానికి ఎవరైనా హీరోయిన్లు ఉన్నారా? అని..

    మాతో గడపటానికి ఎవరైనా హీరోయిన్లు ఉన్నారా? ఎవరైనా ఆర్టిస్టులను మాకు పరిచయం చేయండి.... అని అడుగుతున్నారు. ఇది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. చాలా మంది దర్శకులు ఈ విషయం బయటకు చెప్పడం లేదు. ఇంకా చాలా బ్యాడ్ హ్యాబిట్లతో ఇండస్ట్రీకి వస్తున్న నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి నిర్మాతలతో నేను ఇమడలేక పోతున్నట్లు బాబ్జీ చెప్పుకొచ్చారు.

    సినిమాల్లో నటించే మహిళలు బ్రోతల్సా?

    సినిమాల్లో నటించే మహిళలు బ్రోతల్సా?

    అలాంటి ఆలోచనతో వస్తున్న వారు ఇండస్ట్రీకి సినిమాల కోసం రావడం లేదు. సినిమాల పేరుతో హీరోయిన్ల కోసం, అమ్మాయిల కోసం వస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న లేడీస్ వారి దృష్టిలో ఎలా కనిపిస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్లేమైనా బ్రోతల్సా? అమ్ముడు పోయేవారా? ఆ మధ్య ఇండస్ట్రీలో జరిగిన కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు వందశాతం కరెక్ట్. ఆ ఉద్యమాలు ఇంకా జరుగాలి... అని బాబ్జీ చెప్పుకొచ్చారు.

    మంచి నిర్మాతలు కూడా ఉన్నారు

    మంచి నిర్మాతలు కూడా ఉన్నారు

    కొందరు అమ్మాయిలు ఇలా కాంప్రమైజ్ కావాలని అడుగుతున్నారని మీడియాకు చెప్పారు. వారినే కాదు.. హీరోయిన్లను మాకు సెట్ చేయమని నేరుగా డైరెక్టర్లనే అడుగుతున్నారు, ఇది వాస్తవం. ఇలాంటి చెడ్డవారితో పాటు మద్రాసులో ఉన్నపుడు నిర్మాతలు ఎలా ఉన్నారో అలాంటి సభ్యత, సంస్కారం ఉన్న మంచి నిర్మాతలు ఉన్నారు. వారికి నా పాదాభివందనం, వారు సినిమాను సినిమాలాగే చూస్తారు... అని బాబ్జీ తెలిపారు.

    ఆఫీసులోనే నీచమైన పనులు చేస్తున్నారు

    ఆఫీసులోనే నీచమైన పనులు చేస్తున్నారు

    నా దృష్టిలో సినిమా ఆఫీస్ అంటే టెంపుల్. నా ఆఫీసులో మా నాన్న సిగరెట్ తాగడాన్ని కూడా ఒప్పుకునేవాడిని కాదు. కానీ ఇపుడు చాలా మంది సినిమా ఆఫీసుల్లో మందు కొట్టడం, ఇంకా చాలా నీచమైన పనులు చేయడం, ఆఫీసుకు ఆర్టిస్టులను పిలిపించుకుని బ్యాడ్‌గా బిహేవ్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి చోట ఇమడలేక బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని బాబ్జీ తెలిపారు.

    English summary
    Tollywood Director Babji about the dark side of the film industry. Babji is an Indian film director, screen writer, who works primarily in the Telugu cinema. He is known as the Dynamic Director in Telugu Film Industry for his style of movie making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X