twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోటి నష్టపరిహారం...దర్శక,నిర్మాతలకు నోటీసులు

    By Srikanya
    |

    చెన్నై : లక్ష్మణ్‌ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రం 'రోమియో జూలియట్‌'. ఇందులో హన్సిక హీరోయిన్. పూనంభజ్వా రెండో హీరోయిన్. డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులో అనిరుధ్‌ పాడిన 'డండనకా..' పాట ఇప్పటికే అన్ని ఎఫ్‌ఎం, టీవీ ఛానెళ్లలో మారుమోగుతోంది. అయితే ఇప్పుడా పాటే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని నటుడు, దర్శకుడు టి.రాజేందర్ రోమియో జూలియట్ చిత్ర నిర్మాతకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పూర్తి వివరాల్లో కెళితే..డండన్నక పాట వ్యవహారం ముదురుతోంది. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం రోమియో జూలియట్. నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం యువగీత రచయిత లోకేష్ డండన్నక అనే పాటను రాశారు. మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు.

    ఈ పాటలోని పదాలు దర్శక నటుడు టి.రాజేందర్‌కు సంబంధించి ఉండటంతో ఆయన తన అనుమతి లేకుండా తనకు సంబంధించి పాట రాయడం ఏమిటంటూ చిత్ర నిర్మాత, దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకులకు నోటీసులు పంపారు. అందులో టి ఆర్‌ న్యాయవాది పేర్కొంటూ డండన్నక పాటలో తన క్లయింట్ టి.రాజేందర్ మాట్లాడే భాషను అనుకరిస్తూ ఆయన పేరును వాడుకున్నారన్నారు.

    TR sends legal notice for 'Dandanakka'

    ఇలాంటి చర్యలు టి.రాజేందర్‌కు దుష్ర్పచారాన్ని ఆపాదించడమే అవుతుందన్నారు. అదే విధంగా ఆయన ఇమేజ్‌కు భంగం వాటిల్లుతోందన్నారు. అందువలన నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోమియో జూలియట్ చిత్ర నిర్మాత నందగోపాల్‌కు, దర్శకుడు లక్ష్మణన్, సంగీత దర్శకుడు డి.ఇమాన్, గీత రచయిత లోకేష్ పాడిన అనిరుధ్‌లకు నోటీసులు పంపారు.

    దర్శకుడు మాట్లాడుతూ.. ఎస్‌జే సూర్య నటించిన 'కల్వనిన్‌ కాదలి' చిత్రానికి దర్శకుడిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టా. ఆ తర్వాత కొన్ని చిత్రాలు విడుదల చేశా. ఎప్పటి నుంచో దర్శకుడు కావాలని, 'రోమియో జూలియట్‌' కథను తెరపై ఆవిష్కరించాలన్నదే నా ఆశ. ఆ కలతో 'రోమియో జూలియట్‌'కు ఇప్పుడు దర్శకుడిగా మారానని అన్నారు.

    సంగీత దర్శకుడు డి.ఇమాన్‌ మాట్లాడుతూ.. నిన్నటి వరకు అన్ని గ్రామీణ చిత్రాలకే సంగీతం సమకూర్చేవాడిని. బాణీలు కట్టాలంటే.. అంతా తాటి తోపు, పచ్చని చెట్లు, పల్లె, ఎద్దలబండి.. ఇవే కనిపించేవి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా 'రోమియో జూలియట్‌'కు స్వరాలు సమకూర్చా. అంతా మిద్దెలు, మేడలు, పబ్‌లు, క్లాస్‌ కల్చర్‌కు బాణీ కట్టా. ఇదో కొత్త అనుభవం. తామరై, మదన్‌కార్కి, రోకేష్‌ రాసిన పాటలు అనుకున్నట్టే బాగొచ్చాయని అన్నారు.

    జయం రవి మాట్లాడుతూ.. అద్భుతమైన దర్శకుడి పరిచయ చిత్రంలో హీరోగా నటించడం ఆనందంగా అనిపిస్తోంది. ఇది అసలైన 'రోమియో జూలియట్‌' కథ కాదు. ఆ కథ చివర్లో ట్రాజెడీగా ఉంటుంది. కానీ ఈ కథ సుఖాంతంగా ముగిస్తుంది. అనిరుధ్‌ పాడిన 'డండనకా..' పాట ఇప్పటికే అన్ని ఎఫ్‌ఎం, టీవీ ఛానెళ్లలో మారుమోగుతోంది. సినిమా విడుదలయ్యాక యువత మెచ్చిన పాటగా ఉంటుంది. ఇలాంటి పాటను అందించిన ఇమాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

    హన్సిక.... జయం రవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వేసవి కానుకగా అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.... 'రోమియో జూలియట్‌' కథ ట్రాజెడీగా ముగిస్తే.. ఈ సినిమా మాత్రం హ్యాపీగా ఎండ్ అవుతుందట.

    English summary
    The song ‘Dandhanaka’ in upcoming Tamil movie Romeo Juliet has caught on well with fans for its catchy tune. T Rajendar has filed a legal notice against the movie’s producers. The ‘tribute’ has not gone down well with the actor who has filed a legal notice to the producer, director, music-director, song-writer, singer demanding a sum of Rs. one crore as compensation in addition to a demand to remove the song from Youtube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X