»   » షకీలా ను దత్తత చేసుకున్న హిజ్రాల ప్రెసిడెంట్

షకీలా ను దత్తత చేసుకున్న హిజ్రాల ప్రెసిడెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: షకీలా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెను తాజాగా తిరుచ్చి ట్రాన్స్‌జెండర్ ప్రెసిడెంట్ తమ కుమార్తెగా దత్తత తీసుకున్నారు. తిరుచ్చిలోని ట్రాన్స్ జెంబర్ అశోశిషయేషన్ మీటింగ్ లో ఈ విషయం ప్రకటించారు. ఆ సంఘ అధ్యక్ష్యుడు మోహన్మంబాల్ ఆమెను దత్తత తీసుకోవటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. వారు ప్రతి సంవత్సరం జరుపుకునే ఏన్యువల్ ట్రాన్సజెండర్స్ ఫెస్టివల్ ...కూవగమ్ జరిగింది. విల్లుపురం జిల్లా..తమిళనాడుకు ఎక్కడెక్కడి ట్రాన్సజెండర్స్ పోగయ్యి...ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవంలో అనేక పోగ్రాములు జరిగాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళనాడు రాష్ట్రంలోని కూవగమ్‌ ప్రాంతంలో ఉన్న అరవణ్‌ దేవాలయంలో కూతందవర్‌ పండుగను ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగ రోజున దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హిజ్రాలు ఇక్కడికి చేరుకుంటారు.

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా ఉలుందర్‌పేట్‌ తాలుకాలోని కూవగమ్‌ ఓ గ్రామం. ఈ గ్రామంలోని 200 సంవత్సరాల పురాతనమైన కూతందవర్‌ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో మహాభారతంలోని అర్జునుడి కుమారు డు అరవణ్‌ ఇక్కడ దేవుడిగా వెలిశాడు. ఈ పట్టణం హిజ్రాల మూలంగా నేడు ఎంతో ప్రఖ్యాతిగాంచింది.

Transgenders president adopts Shakila as her daughter

ప్రతి ఏడాది ఏప్రి ల్‌, మే నెలలో వచ్చే తమిళ నెల చిత్రాయ్‌లో 18 రోజుల పాటు కూతందవర్‌ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ సం దర్భంగా దేశంలోని వేలాదిమంది హిజ్రాలు ఇక్కడికి విచ్చేస్తారు. ఈ సందర్భంగా అర్జునుడి కుమారుడు అరవణ్‌తో హిజ్రా ల వివాహాలను ఘనంగా జరిపిస్తారు. ఈ ఏడాది కూతందవర్‌ పండుగలో భాగంగా వేడుకలు, వివాహాలు పెద్ద ఎత్తున జరిగాయి.

కూతందవర్‌ పండుగ కోసం తమిళనాడుతో పాటు మన రాష్ట్రం, కేరళ, కర్ణాటకల నుంచి అధిక సంఖ్యలో హిజ్రాలు హాజ రువుతుండగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొంతమంది హిజ్రాలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక ఈ పండుగ గురించి చెన్నైకి చెంది న ఓ హిజ్రా మాట్లాడుతూ జీవితంలో తాము జరుపుకునే పం డుగ ఇదొక్కటేనని చెప్పారు.

మిళనాడు రాష్ర్టం కూవగమ్‌ గ్రామంలో ప్రతి ఏటా హిజ్రాల కోసం అందాల పోటీలను సైతం నిర్వహిస్తుండడం విశేషం. మిస్‌ కూవగమ్‌ పేరిట గత అయిదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ పోటీలు జరుగుతున్నాయి.విల్లుపురం జిల్లా అరవానీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తమిళనాడు రాష్ట్రం ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తోంది.

హిజ్రా ల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిం చేందుకు, వారిలో ఉన్న టా లెంట్స్‌, నాలెడ్జ్‌, స్కిల్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ అందాల పో టీలను నిర్వహిస్తున్నట్టు విల్లుపురం జిల్లా అరవానీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే హిజ్రాల్లో విజేతలను పర్సనాలిటీ, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ నాలెడ్జ్‌, వివిధ సాంఘిక అంశాల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.

English summary
The Trichy transgenders associations President has adopted actress Shakila as her daughter. The Trichy transgenders associations President Mohanambal has adopted actress Shakila as her daughter in annual transgenders festival held at Koovagam village, near Viluppuram dist, TN. Thousands of transgenders from all over the world have attended and performed various programmes in the festival.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu