»   » ఆ జెస్సీ పాత్ర అచ్చంగా నా క్యారెక్టరే... త్రిషా

ఆ జెస్సీ పాత్ర అచ్చంగా నా క్యారెక్టరే... త్రిషా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఔను. అచ్చంగా నేను జెస్సీలాంటి అమ్మాయినే. జెస్సీకి నేను కార్బన్‌ కాపీ అనుకోండి. తనలానే నేను కూడా ఎప్పుడూ అయోమయంగా ఉంటాను. ఒక క్షణంలో ఒకటి కావాలనిపిస్తుంది. మరు క్షణంలో వద్దనిపిస్తుంది. నేను పెద్ద కన్‌ఫ్యూజ్‌ మాస్టర్‌ని' అంటోంది త్రిష. గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొంది విడుదలైన 'విన్నైత్తాండి వరువాయా' (ఏ మాయ చేవావే తెలుగు) లో జెస్సీ పాత్ర చేసిందామె. తెలుగులో సమంతకి ఎంత పేరు వచ్చిందో అక్కడా త్రిషకు అంత క్రేజ్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన అనుభూతులను పంచుకోవడానికి ఓ వెబ్ సైట్ వారు నిర్వహించిన ఆన్ లైన్ పోగ్రామ్ లో హాజరైంది. పోగ్రామ్ లో భాగంగా ఓ అభిమాని "మీరు జెస్సీలాంటి అమ్మాయేనా?' అన్నప్పుడు పై విధంగా స్పందిచింది.

ఇక మీరు బాగా ఇబ్బందిపడే సందర్భాలు ఏంటి? అని మరో అభిమాని ప్రశ్నిస్తే... "నా అభిమానులతో మాట్లాడినప్పుడు నాకు హ్యాపీగానే ఉంటుంది. అయితే అభిమానులు కాని వాళ్లు మాత్రం పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు రకరకాల 'కామెంట్స్‌' విసురుతుంటారు. అవి వినపడినప్పటికీ విననట్లు నటించి, పెదాల మీద చిరునవ్వు చెరగనివ్వకుండా మేనేజ్‌ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి నచ్చని తారల మీద కోడి గుడ్లు, టమోటాలు కూడా విసురుతుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా సినిమా తారలు తమ కోపాన్ని వ్యక్తపరచకుండా కూల్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజంగా అవి మాకు అగ్నిపరిక్షల్లాంటివి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం త్రిష తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా అనే హిందీ చిత్రంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu