»   » ఆ హీరో భజన లో మునిగి తేలుతున్న త్రిషా

ఆ హీరో భజన లో మునిగి తేలుతున్న త్రిషా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు త్రిషను కదిలిస్తే చాలు కమల్ హాసన్ గురించే పదే పదే చెప్తోంది. గత కొద్ది నెలలుగా ఇదే తంతు. ఎవరు ఏ విషయంపై కదిలించినా అక్కడికే తీసుకెళ్తోంది. లేటెస్ట్ గా ఓ ఇంటర్వూలో ఇదే మ్యాటర్ గురించి ఆమె తన్మయంగా మాట్లాడుతూ...కమల్ తో చేస్తున్నాను అనే కల నెరవేరబోతోందనుకుంటున్న సమయంలో అది వర్కవుట్ కాదని తేలిపోయినప్పుడు మనసుకి చాలా బాధ అనిపించింది. కానీ ఆ కల మళ్ళీ తిరిగివచ్చింది. కమల్ తాజా చిత్రంలో చేస్తున్నాను..మామూలుగా ఇతర సినిమాలకు సైన్‌ చేసేటప్పుడు నేనుఆ చిత్రకథ మొత్తం వింటాను. కానీ కమల్‌తో సినిమా కాబట్టి కథ గురించి ఆలోచించలేదు. ఆ స్టోరీలైన్‌ ను ఫోన్‌లో వినేసి ఒప్పేసుకున్నానని త్రిష అంటున్నారు.అయినా కమల్ మహా మేధావి. ఏ సబ్జెక్ట్‌ గురించైనా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. కమల్‌ కాంబినేషన్ ‌లో నటించడం హ్యాపీగా ఉంది' అంటూ చెప్తోంది.

ఇక కమల్‌హాసన్‌ హీరోగా ప్లాన్‌ చేసిన 'మర్మయోగి' చిత్రంలో త్రిషని ఓ హీరోయిన్ గా మొదట ఎంపిక చేసారు. ఫొటోసెషన్‌ కూడా జరిగిన తరుణంలో ఈ చిత్రం ఆగిపోయింది. కమల్‌ పక్కన నటించబోతున్నామనే ఆనందం కాస్తా త్రిషలో ఆవిరైపోయింది. అయితే అనుకోకుండా కమల్ తన తదుపరి చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ గ్యాప్ లో త్రిష తను కమల్ ప్రాజెక్టు ఆగిపోయినా ఆయన భజన మానలేదు. మీడియాలో ఊదరకొట్టింది. దాంతో ఇంప్రెస్ అయిన కమల్ మళ్ళీ ఆమెనే తీసుకున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే హిందీలో అక్షయ్‌కుమార్‌ సరసన త్రిష నాయికగా నటిస్తున్న 'కట్టా మీఠా' చిత్రం మరో 10, 15 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసుకోబోతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో తనకిది భారీ లాంచ్‌ సినిమాగా నమ్ముతున్నట్లు త్రిష చెబుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu