»   » నేను రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చానని...త్రిష

నేను రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చానని...త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో నాకు పెళ్ళైందని రాసారు..ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో బిడ్డకు జన్మనిచ్చానని మీడియాలో మాట్లాడుతున్నారు.ఈ రూమర్స్ ఎవరు క్రియోట్ చేస్తున్నారో,ఏం ఆసించి క్రియోట్ చేస్తున్నారో నాకు అస్సలు అర్దంకావటంలేదు అంటూ త్రిష తనపై వస్తున్న రూమర్స్ పై మండిపడుతూ ఇలా స్పందించింది. ఈ విషయమై మాట్లాడుతూ...ఇంతకు ముందు ఒక రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేశారని తెలిపారు.మళ్లీ ఇప్పు డు ఒక వ్యాపారవేత్తతో బిడ్డకు జన్మనిచ్చానని రూమర్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు పలువురితో పెళ్లి చేశారని అన్నారు. ఇకపై ఇంకెంత మందితో పెళ్లి చేయనున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రహస్యంగా వివాహం చేసుకునే అవసరం తనకు లేదని అన్నారు.ఈ రూమర్స్ వల్ల తన అవకాశాలు చేజారిపోతాయని,అందుకే తను ఇలా మీడియా ముఖంగా తన వ్యధని చెప్పుకోవాల్సి వచ్చిందని అంది. ఇక ప్రస్తుతం త్రిష... తమిళంలో అజిత్ సరసన మంగాత్తా, తెలుగులో తీన్‌మార్‌లో పవన్ కల్యాణ్‌తో నటిస్తున్నారు.

English summary
“When I plan to marry I will do an official announcement on that. For me, career is in top priority”, says Trisha. Popular actress Trisha denies the rumors on her marriage and stated all the reports on her love affair and marriage is baseless. She also cleared that she never found her ‘Mr. Perfect’. Trisha has been facing rumors on her marriage and her affair with a business tycoon for last few months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu