»   » రజనీకాంత్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన త్రిష

రజనీకాంత్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ ప్రక్కన నటించాలని హీరోయిన్స్ అంతా ఉవ్విళ్ళూరుతూంటారు. తాజాగా త్రిషకు ఆ అవకాశం వచ్చినట్లు సమాచారం. రజనీకాంత్ చేస్తున్న యానిమేషన్ చిత్రం సుల్తాన్ ది వారియర్లో త్రిష కనపడనుంది. అక్తర్ స్టూడియోస్ పతాకంపై రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ యానిమేషన్ పాత్రలో నూ, సాధారణ వ్యక్తిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఇప్పటికే యానిమేషన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ భాగాన్ని షూట్ చేసే బాధ్యతను దర్శకుడు కెఎస్. రవికుమార్ తీసుకున్నారు. సుల్తాన్ ది వారియర్లో యానిమేషన్ పాత్రకు జోడీగా విజయలక్ష్మి నటిస్తున్నారు. మరో రజనీకి జంటగా త్రిషను తీసుకున్నారు. మన్మథన్ అంబులో త్రిష నటనను మెచ్చుకున్న రవికుమార్ ఈ చిత్రంలో ఆమెను రికమెండ్ చేసారు. అలాగే చిత్రానికి సుల్తాన్ ది వారియర్ పేరు మార్చి హరి అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఏదైమైనా త్రిష ఒక్క చిత్రానికే రవికుమార్ ని బుట్టలో వేసుకుందని తమిళ పరిశ్రమలో అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu