»   » గౌతం మీనన్ దర్శకత్వంలో తన పాత్ర గురించి త్రిష

గౌతం మీనన్ దర్శకత్వంలో తన పాత్ర గురించి త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతం మీనన్ దర్శకత్వంలో త్రిష, శింబు కాంబినేషన్ లో విన్నయతాండి వరువాయి చిత్రం వస్తున్న సంగితి తెలిసిందే. ఆ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉందని మురిసిపోతోంది త్రిష. పిబ్రవరి 26 న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో తన పాత్ర పేరు జెస్సీ అని, తను ఓ మళయాళి అమ్మాయి పాత్ర పోషించానంటోంది. ఆ పాత్ర చాలా కష్టంతో కూడుకున్నదని అంటోంది. అలాగే తన అభిమాన సంగిత దర్శకుడు ఎఆర్ రహమాన్ తో ఈ చిత్రంలో కలిసి పనిచేయటం ఓ మధురానుభూతి అంటోంది. ఇక దర్శకుడు స్పష్టంగా తను తీస్తున్న అంశంపై క్లారిటీ కలిగిఉండటం వల్లే ఈ చిత్రం అంత అందంగా రాగలిగిందని, ఈ చిత్రం తనకు ల్యాండ్ మార్క్ గా మిగులుతుందని చెప్తోంది. అలాగే శింబు గురించి చెప్పటానికి తను సరిపోనని మెచ్చుకుంటూ విడుదల ఎప్పుడా అని చాలా ఏక్జైయిటీ ఫీలవుతూ ఎదురుచూస్తున్నానంది.

అలాగే ఈ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో శింబు పాత్ర పేరు కార్తీక్. అతను ఓ అసెస్టెంట్ డైరక్టర్ గా చేస్తూంటాడు. అతను తన వృత్తిలో పెద్దగా ఎదగాలనే అభిలాషకీ,క్రిష్టియన్ అమ్మాయి జెస్సీ తో ప్రేమ కీ మద్య అతను నలుగుతూ రెండింటినీ ఎలా సాదించుకున్నాడనే పాయింటు చుట్టూ తిరుగుతుంది. ఇక ఇదే చిత్రం తెలుగులో నాగచైతన్య తో రూపొందించి అదే రోజున రిలీజు చేస్తున్న సంగితి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu