»   » డైరక్టర్ కి ప్రెవేట్ గిప్ట్ ఇచ్చిన త్రిష

డైరక్టర్ కి ప్రెవేట్ గిప్ట్ ఇచ్చిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేసావె తమిళ వెర్షన్ విన్నతాండై వరువాయి చిత్రం తమిళనాట మంచి కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది. దాంతో అందులో జెస్సీ పాత్రను చేసిన త్రిష చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని ఆమె మీడియాతో పంచుకుంటూ తనకు గౌతం ఇచ్చి ఈ హిట్ తనను ధ్రిల్ గురిచేస్తోందని, అలాగే ఆ ఆనందంతో గౌతమ్ కి ఓ ప్రెవేట్ గిప్ట్ ఇవ్వటం జరిగిందని చెప్పుకొచ్చింది. ఏంటా గిప్ట్ అంటే నవ్వుతూ దాటేసింది. అలాగే తన సరసన చేసిన శింబుని కూడా బాగా మెచ్చుకుంటూ మాట్లాడింది. ప్రస్తుతం త్రిష కమల్ తో కెఎస్ రవికుమార్ ప్రాజెక్టు కమిటయ్యింది. అందులో మాధవన్ కూడా చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నడిచే ఆ చిత్రం ఆద్యంతం కామిడీగా నడుస్తుంటున్నారు. అలాగే త్రిష...తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో చేస్తున్న కట్టా మీటాలో బిజీగా ఉంది. ఇక ఆమె చేసిన నమో వెంకటేశ చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళటాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్ధావిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu