»   » అల్లుడు దగ్గర త్రిష చక్రం తిప్పిందా, అందుకే అమలాపాల్ ని ప్రక్కన పెట్టారా?

అల్లుడు దగ్గర త్రిష చక్రం తిప్పిందా, అందుకే అమలాపాల్ ని ప్రక్కన పెట్టారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయాలన్నది ప్రతీ హీరోయిన్ కు కలే. అయితే ఆ కల ఈ మధ్యకాలంలో విడాకులకు అప్లై చేసిన అమలా పాల్ కి తీరబోతోందని వార్తలు వచ్చాయి. ఆమె ను రజనీ చిత్రం కబాలి సీక్వెల్ లో హీరోయిన్ గా తీసుకుంటారని అంతా భావించారు. అయితే లాస్ట్ మినిట్ లో త్రిష సీన్ లోకి వచ్చింది.

అయితే ఈ మార్పుకు కారణం రజనీకాంత్ అల్లుడు ధనుష్ అంటున్నారు. రీసెంట్ త్రిష తో సినిమా చేసిన ధనుష్..తెగ ఇంప్రెస్ అయ్యి పోయి... ఆమెను రికమెండ్ చేసి, నిర్మాతను, రజనీని ఒప్పించారని చెప్పుకుంటున్నారు. అయితే అమలా పాల్ కూడా ఇప్పుడు వడ చెన్నై చిత్రం లో ధనుష్ ప్రక్కన చేస్తూ బిజీగా ఉంది.

త్రిష కెరీర్ ని గమనిస్తే.. రజనీకాంత్‌తో మినహా ఇతర స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించిందనే చెప్పవచ్చు. దాంతో సూపర్‌స్టార్‌తో నటించాలన్నది ఆ అమ్మడి చిరకాల కోరికగా మిగిలిపోతుందని భయపడింది. ఎందుకంటే రజనీకాంత్ వయస్సా పెరిగిపోయింది. సినిమాలు చేసే సంఖ్య కూడా తగ్గుతుంది. దాంతో ఆమె కు రజనీతో చేయకుండా ఉండిపోతానేమో అనుకుందిట.

Trisha in Rajinikanth's 'Kabali 2'?

మరో ప్రక్క తన తోటి హీరోయిన్స్ నయనతార, శ్రీయ, అనుష్క, రాధికాఆప్తే, ఆంగ్ల భామ ఎమీజాక్సన్ కూడా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తనకెందుకు అలాంటి అవకాశం రాలేదన్న ప్రశ్నను త్రిష చాలా సార్లు వేసుకున్నారట.

ఇంతకు ముందే కబాలి చిత్రంలో రజినీకాంత్‌తో జత కట్టే అవకాశం తనకు లభిస్తుందని ఈ బ్యూటీ అనుకుందిట. అయితే లాస్ట్ మినిట్ లోదర్శకుడు పట్టుబట్టి...త్రిషను పెడితే సెక్సీ లుక్ వస్తుంది..సినిమాలో చేసే పాత్రకు అలాంటి ఇమేజ్ ఉండకూడదని, భావించి రాధికా ఆప్టేని తీసుకున్నారు.

దాంతో ఎప్పటికై నా సూపర్‌స్టార్‌తో నటించి తీరతానన్న నమ్మకంతో ఉన్న త్రిష నిరాశపడింది. కానీ రీసెంట్ గా ధనుష్‌కు జంటగా చేసిన ధర్మయోగి చిత్రంలో నటించిన త్రిష తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ధనుష్ రికమండేషన్ తో ఈ సీక్వెల్ కు ఓకే అయ్యిందని తమిళ సినిమా వర్గాలు చెప్తున్నాయి.

కబాలి 2 చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. కాగా ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినీని పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష తాజాగా అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2, విజయ్‌సేతపతి సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు.

కబాలి విషయానికి వస్తే...ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. అయితే ఆ క్రేజడ్ ని క్యాష్ చేసుకోవటానికి, ఇప్పుడు 'కబాలి' సీక్వెల్ మళ్లీ తెరమీదికి వచ్చింది.

తమిళ ఫిలిం ఛాంబర్లో నిర్మాత కలైపులి థాను 'కబాలి-2' టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో 'కబాలి' సీక్వెల్ పక్కా అని అందరికీ అర్దమైపోయింది. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేస్తున్న రంజిత్.. వచ్చే ఏడాది రజినీ '2.0' నుంచి ఫ్రీ అయ్యాక ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నాడని సమాచారం.

English summary
superstar Rajinikanth and Pa Ranjith are once again coming together for Kabali 2. The latest buzz is that actor Trisha, who is basking in the success of Kodi, has been approached to play the leading lady in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu