»   » ఆ సమయంలో కమల్ నన్ను నిరాశపరిచారు...త్రిష

ఆ సమయంలో కమల్ నన్ను నిరాశపరిచారు...త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ ఆ సమయంలో నాకు తీవ్రమైన నిరాశ కలిగించారు. అయితే ఆ బాధ కూడా ఎంతో కాలం లేదులేండి అంటూ తనకు 'మర్మయోగి' చిత్రం మిస్సవటం గురించి వివరిస్తోంది త్రిష. ఆమె మాటల్లోనే..అప్పట్లో కమల్‌హాసన్‌ తాను నిర్మిస్తున్న 'మర్మయోగి' చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. కథకు ఆ పాత్ర చాలా కీలకమైనది. పైగా ఆ పాత్ర చేయడానికి ఎన్నో ప్రత్యేకమైన విద్యలను అభ్యసించాను. కానీ, ఆ సినిమా ఆగిపోవడం నాకు తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఆ బాధ కూడా ఎంతో కాలం లేదులేండి.

ప్రస్తుతం కమల్‌సార్‌తో 'మన్మధన్‌ అంబు' చిత్రంలో చేస్తున్నా. నాకు ఇష్టమైన నటుల్లో కమల్‌ సార్‌ ది ఫస్ట్‌ప్లేస్‌. ఆయనతో కలిసి చేయడం మరచిపోలేని అనుభూతి కలిగిస్తోంది' అంటూ పొగడ్తల్లో ముంచేస్తోంది త్రిష. అంతేగాక కమల్ తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఏ సబ్జెక్ట్ మీదయినా కమలహాసన్ కి మంచి కమాండింగ్ ఉంది అంటోంది. ఇక మొన్నటివరకూ అక్షయ్ కుమార్ ని పొగిడిన త్రిష ఈ చిత్రం ప్రారంభం కాగానే ఇటు భజన ప్రారంభించేయటం అందరినీ నవ్వుకునేలా చేస్తోంది.

కమల్ తో త్రిష చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. కమల్, త్రిషలతో ఓ పాట(పొయటిక్ లైన్)ను కూడా పాడించాడట, ఇది బ్యాక్ గ్రౌండ్ అపీయరెన్స్ గా ఉంటుంది. ఇదే ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. అంతే తన ప్రక్కన పాత్రనే కాదు పాటను కూడా పంచుకోవడంతో త్రిష ఆనందానికి అవధులు లేవట ఇంకా ఈ చిత్రంలో మాదవన్, సంగీతా ప్రధాన పాత్రలు చేయనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu