For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ హీరోకు జంటగా త్రిష ఖరారు (ఫోటోలు)

  By Srikanya
  |

  చెన్నై : సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ సరసన త్రిష నటించనుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎన్‌కౌంటర్‌ కథలతో పాటు ప్రేమకథలను స్త్టెలిష్‌గా తెరకెక్కిస్తాడని పేరు సంపాదించుకున్నాడు గౌతమ్‌ మీనన్‌. సూర్య, శింబులాంటి యువనటులతోనే కాక కమల్‌హాసన్‌, శరత్‌కుమార్‌లాంటి సీనియర్లతో పని చేశారాయన. శరత్‌కుమార్‌తో ప్రేమ, యాక్షన్‌ కలబోతగా 'పచ్చైకిళి ముత్తుచరం' తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

  మరోసారి శరత్‌కుమార్‌తో చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారట గౌతమ్‌మీనన్‌. ఇందులో హీరోయిన్ పాత్రకు త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'విన్నైతాండి వరువాయా' లో నటించిన పరిచయంతో ఆమెకు మరోసారి అవకాశం వచ్చినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడయ్యే అవకాశాలున్నాయని అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు.

  నిజానికి 'విన్నైత్తాండి...' తర్వాత గౌతమ్ దర్శకత్వంలో మళ్లీ సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుందని త్రిష అనుకుంటున్నారట. సూర్యతో గౌతమ్ దర్శకత్వం వహించబోతున్న 'ధృవనక్షత్రం'తో ఆ కోరిక తీరుతుందని ఆమె భావించారు. కానీ ఆ చిత్రంలో వేరే హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. పైగా, అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కే దాఖలాలు కనిపించడంలేదని వినికిడి. ఈ నేపథ్యంలో శరత్‌కుమార్‌తో చేయబోయే చిత్రం గురించి త్రిషకు గౌతమ్ చెప్పడం, ఈ చిత్రకథ, పాత్ర నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపడం జరిగాయని చెన్నయ్ టాక్.

  త్రిష అందాల ఆరబోత-ప్రస్తుత పరిస్ధితి విశ్లేషణ స్లైడ్ షో లో..

  ‘రమ్' కిక్ ఇస్తేనే...

  ‘రమ్' కిక్ ఇస్తేనే...

  హీరోయిన్ గా పన్నెండేళ్లకు పైగానే వెండితెరను ఏలుతున్న త్రిష ప్రస్తుతం ‘రమ్'తో పాటు మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంలోను, రెండు తమిళ చిత్రాలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఆమెకు తెలుగులో హీరోల సరసన ఆఫర్స్ రావటం లేదని నిరాసగానే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ పెద్ద హీరోలు సరసన తప్ప ఆమెకు వచ్చే ఛాన్స్ కపడటం లేదు.

  మరో ఇద్దరితో ...

  మరో ఇద్దరితో ...

  మరో ప్రక్క అనుష్క, త్రిష, ఇలియానా ముగ్గురే కాదు తమన్నాను కూడా హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయబోతున్నాడు తమిళ యంగ్‌ హీరో శింబు... తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'మన్మథన్‌-2'ను రూపొందిస్తానంటున్నాడు శింబు... ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా అత్యంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాననే ధీమాతో ఉన్నాడు... అందుకే ఎ.ఆర్‌.రెహమాన్‌తో స్వరకల్పన చేయిస్తాననీ చెబుతున్నాడు. ఈ ప్రాజెక్టు తనకు క్రేజ్ తెస్తుందని త్రిష భావిస్తోంది.

  హాట్ ఫోటో షూట్స్

  హాట్ ఫోటో షూట్స్

  చెప్పుకోతగ్గ ఆఫర్స్ లేకపోయినా తన ఫోటో షూట్ లతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది త్రిష. తెలుగులో దాదాపు 20 చిత్రాలు వరకూ చేసిన ఈ ముద్దుగుమ్మ కి 2012 పెద్దగా కలిసి రాలేదు. ఆమె బాడీగార్డ్,దమ్ము చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో ఖాళీ పడింది. అయితే తాజాగా ఎమ్.ఎస్ రాజు చిత్రం రమ్ లో బుక్కై మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఆ సినిమా పరిస్ధితి ఏమైందో తెలియటం లేదు.

  ఏలింది కానీ...

  ఏలింది కానీ...

  స్టాలిన్ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవితో, కింగ్ చిత్రంలో నాగార్జునతో, నమోవెంకటేశ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలతో విక్టరీ వెకంటేష్, అతడు, సైనికుడు చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, జూ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో, వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ సరసన, కృష్ణ చిత్రంలో రవితేజ సరసన ఇలా దాదాపు టాప్ హీరోలందరితో నటించింది.

  వరస ఫ్లాప్స్...

  వరస ఫ్లాప్స్...

  త్రిష తెలుగులో నటించిన చిత్రాల్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే త్రిష ఈ మధ్య తెలుగులో నటించిన తీన్ మార్, దమ్ము చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం, తమిళంలోనూ పలు చిత్రాలు నిరాశ పరచడంతో త్రిష హవా కాస్త తగ్గింది. తెలుగులో ఆమె ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. అయితే తమిళంలో ఆమె నటించిన చిత్రాలు ఇటీవల విజయం సాధించడంతో అక్కడ తన హవా కొనసాగిస్తోంది. తాజాగా విశాల్ సరసన ‘వేటాడు వెంటాడు' అనే తమిళ డబ్బింగ్ చిత్రం ద్వారా త్వరలో త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

  ఇలా మొదలైంది...

  ఇలా మొదలైంది...

  త్రిష దాదాపు సౌతిండియా టాప్ స్టార్లందరితో నటించింది. ఒకరకంగా ఏలిందనే చెప్పాలి. మోడలింగ్ రంగంలో సక్సెస్ అయిన తర్వాత సినిమాల వైపు తన దృష్టి సారించిన హీరోయిన్ త్రిష..... జోడి చిత్రంతో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిమ్రన్ ఫ్రెండ్‌గా ఓ చిన్న క్యారెక్టర్ చేసిన త్రిష...... వెంటనే అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మౌనం పేసియాదె' చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం దక్కించుకుంది.

  గ్లామర్ తో...

  గ్లామర్ తో...

  డిసెంబర్ 13, 2012లో విడుదలైన ‘మౌనం పేసియాదె' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య, త్రిష పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అలా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష అనతి కాలంలోనే సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్ తదితర టాప్ స్టార్లతో నటించింది.

  పూర్వ వైభవం కోసం...

  పూర్వ వైభవం కోసం...

  తన నటనతో పాటు.... గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. సౌతిండియా చిత్రాలతో పాటు.... కట్టా మీటా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ అదీ కలిసి రాలేదు. బాలీవుడ్లో త్రిషకు అచ్చి రాక పోవడంతో మళ్లీ సౌత్ సినిమాల బాట పట్టింది. త్రిష తాజాగా ఎమ్ ఎస్ రాజు చిత్రం రమ్ లో ..చేస్తోంది. ఆ చిత్రం తిరిగి తన వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

  English summary
  Gautham Menon and Sarath Kumar will be joining hands for a film very soon, which the actor had confirmed this himself and the director is busy with the groundwork. The duo who has earlier teamed up together in Pachaikili Muthucharam will kick start the project early next year and the latest buzz about this project is that Gautham is likely to rope in Trisha to play Sarath's lead pair in this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X