»   » ఎట్టకేలకు... : పెళ్లి కాన్సిల్ విషయమై స్పందించిన త్రిష

ఎట్టకేలకు... : పెళ్లి కాన్సిల్ విషయమై స్పందించిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : "పెళ్లి ఆగిపోయిన విషయం నిజమే. ఎవరూ వూహించని విషయమది. మనకు మించి ఓ సమస్య వస్తున్నప్పుడు అందుకు తలొగ్గాల్సిందే. పాత విషయాలను మాట్లాడటంలో ఎలాంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాపైనే ఉంది. నేను దేవుడి బిడ్డను. నా జీవితాన్ని దేవునికి అప్పగించేశా. ఆయన చూపించిన దారిలోనే వెళ్తాను. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది"అని ఇటీవల ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది త్రిష.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినీ ఇండస్ట్రీకు వచ్చి చాలా కాలం అయినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది నటి త్రిష. ఇటీవల తెలుగులో బాలకృష్ణతో లయిన్ తో ఆడిపాడిన ఈమె తమిళంలో రెండు కొత్త చిత్రాల్లో నటిస్తోంది. నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్‌తో పెళ్లి నిశ్చయమైనా.. చివరి నిమిషంలో కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఈ విషయం గురించి త్రిష ఇదివరకు పెదవి విప్పలేదు. కానీ త్రిష అమ్మ ఉమాకృష్ణన్‌ మాత్రం పెళ్లికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయని స్పష్టం చేశారు. తాజాగా ఈ విషయంపై త్రిష పై విధంగా స్పందించింది.

తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం ...ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారని తేలింది.

 Trisha said that She belive in God only

ఈ నేపధ్యంలో 'ఔను.. నిజమే ...పెళ్లి ఆగిపోయింది' అని త్రిష తల్లి ఉమాకృష్ణన్ తమిళ పత్రికలవారికి తెలియజేశారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ మణియన్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. ఆ వార్త నిజం కాదని ఉమ పేర్కొన్నారు.

త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఆమె చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి... వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా సినిమాలపైనే అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు.

త్రిష కెరీర్ విషయానికి వస్తే... తమిళ,తెలుగు అనే తేడా లేకుండా ... సినీ పరిశ్రమలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని దాటుకుని దిగ్విజయంగా దూసుకెళ్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఆమె శింబు హీరోగా నటించనున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అలై', 'వినైతాండి వరువాయా' చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఇటీవలే సెల్వరాఘవన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చనున్నారు. 'లింగ' చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్న తెలుగు నటుడు జగపతిబాబు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి త్రిష మాట్లాడుతూ ....జీనియస్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం అమితమైన ఆనందం. చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నా. శింబుతో కలిసి మూడో చిత్రంలో నటిస్తున్నానని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాకు అరవింద్‌ కృష్ణ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.

English summary
Hot Trisha said that she only believe in God in an tamil magzine interview when she was asked about her Marriage.
Please Wait while comments are loading...