»   » నిలకడ లేని మనస్తత్వం గలదాన్ని...త్రిష

నిలకడ లేని మనస్తత్వం గలదాన్ని...త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మీకో విషయం తెలుసా?...అందులో నేను చేసిన జెస్సీ పాత్ర నా మనస్తత్వానికి దగ్గరైన పాత్ర. త్రిషకు జిరాక్స్‌ కాపీ జెస్సీ. నిలకడ లేని మనస్తత్వం గలదానిని నేను. నాకుగా నేను ఏ నిర్ణయాన్నీ తీసుకోలేను. కాకపోతే...మరీ రెండేళ్లు చిన్నవాడైన కుర్రాడ్ని ప్రేమించడం అంటే...అది జరిగేపని కాదనుకోండి. అది సినిమా...ఇది జీవితం' అంటోంది త్రిష. ఆమె కొద్ది నెలల క్రిందట ఏ మాయ చేసావె...తమిళ వెర్షన్...విన్నెత్తాండి వరువాయా' చిత్రంలో తనకంటే రెండేళ్లు వయసులో చిన్నవాడైన యువకుడ్ని(శింబు) ప్రేమించే పాత్రలో కనిపిస్తారు. అలాంటిది నిజజీవితంలో కూడా అలాంటిది ఏమైనా ఉందా?...త్రిషని మీడియా అనడిగితే..పై విధంగా స్పందించింది.

ఇక నటన గురించి త్రిష మాట్లాడుతూ -"నాకు నటన అంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌ డేస్‌లో కూడా చిన్న చిన్న కల్చరల్‌ ప్రొగ్రామ్స్‌లో పాల్గొనేదాన్ని. అప్పట్నుంచీ నటనంటే మక్కువే. నా దృష్టిలో నిజమైన నటన అంటే...మనం ఏ పాత్ర అయితే చేస్తున్నామో..ఆ పాత్రగా మారిపోవడమే. మరో విషయం ఏంటంటే...కళాకారుడికి కష్టాలు, కన్నీళ్ల విలువ తెలుసుండాలి...మనసులో భావోద్వేగాలు ఏ సమయంలో ఎలా ఉంటాయో...సుపరిచితమై ఉండాలి. అప్పుడే సన్నివేశానుగుణంగా నటించగలరు. నా వరకూ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కష్టాల విలువ నాకు తెలుసు. ఆ అనుభవాలే ఈ రోజు నన్ను మంచి నటిగా నిలబెట్టాయి అంటూ చెప్పుకొచ్చారు త్రిష.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu