»   »  మొన్న లక్ష్మి మంచు...ఇప్పుడు త్రిష

మొన్న లక్ష్మి మంచు...ఇప్పుడు త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాల కోసం గొంతు సవరించుకొని పాటలు పాడుతున్నహీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలోకి త్వరలో త్రిష చేరబోతోంది. మొన్న లక్ష్మి మంచు చేత దొంగాట చిత్రంలో పాట పాడించిన రఘు కుంచె ఈ సారి త్రిషతో పాడించబోతున్నారు.

త్రిష ప్రధాన పాత్రలో 'నాయకి' అనే చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం త్రిష ఓ పాట పాడబోతోంది. రెండు భాషల్లోనూ ఆమే పాడనుండడం విశేషం. గోవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్‌ నిర్మిస్తున్నారు.

Trisha Sing A song for Nayaki Movie

నిర్మాత మాట్లాడుతూ ''సంగీతంపై మక్కువ ఉన్న హీరోయిన్ త్రిష. ఆమెలో మంచి గాయని ఉంది. ఇదివరకే పలువురు సంగీత దర్శకులు ఆమెతో పాడించాలని ప్రయత్నించినా కుదర్లేదు. మా సినిమా కోసం ఆమె తొలిసారి పాట పాడుతుండడం ఆనందంగా ఉంది. త్రిషతో సంగీత దర్శకుడు రఘు కుంచె పాట పాడించబోతున్నారు''అని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విశేషాలకు వస్తే..

త్రిష ప్రధాన పాత్రలో నిర్మించనున్న హర్రర్‌ కామెడీ చిత్రం 'నాయకి'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రీసెంట్ గా త్రిష ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పోస్టర్‌ అద్భుతంగా ఉందంటూ నటులు రానా, ప్రియమణి, హన్సికలు త్రిషకు అభినందనలు తెలిపారు.

గొవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టు 20న ప్రారంభం అయ్యింది. త్రిషతోపాటు జయప్రకాష్‌, మనోబాల, బ్రహ్మానందం, కోవై సరళ, తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

English summary
Trisha is expected to croon for a song in her upcoming horror-comedy flick, ‘Nayaki’. The Tamil, Telugu bilingual which is to be helmed by Govi is set in the 1980’s and Trisha is all excited about her role.
Please Wait while comments are loading...