»   » మమ్మీలకు పని పెట్టిన త్రిష, ప్రియమణి..

మమ్మీలకు పని పెట్టిన త్రిష, ప్రియమణి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతోన్న త్రిష, ప్రియమణి బాలీవుడ్ సినిమాలవైపు ఆశగా చూస్తున్నారు. బాలీవుడ్ లో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకోవాలని ఇటు ప్రియమణి, అటు త్రిష తెగ తహతహలాడుతున్నారు. 'రక్తచరిత్ర', 'రావణ్' చిత్రాలతో ప్రియమణి బాలీవుడ్ లో అడుగు పెడ్తోంటే, 'కట్టామీటా" సినిమాతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది త్రిష.

ఆల్రెడీ అసిన్, జెనీలియా బాలీవుడ్ లో సెటిలైపోతే, సదా ఈ మధ్యనే ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినా సరైన సక్సెస్ దక్కక గిలగిల్లాడుతోంది బాలీవుడ్ లో. ఇక త్రిషతో పోల్చితే తనకు బాలీవుడ్ లో రెండు సినిమాలు రిలీజ్ కి సిద్దంగా వున్నాయని ప్రియమణిపై సెటైర్లు సందిస్తోంది త్రిష. వీరిద్దరి క్యాట్ ఫైట్ పైన కోలీవుడ్ లో రకరకాల గాసిప్స్ విన్సిస్తోంటే త్రిష బాలీవుడ్ లో అడుగు పెట్టడంతో అసిన్ ఆందోళన చెందుతోందంటూ మరో గాసిప్ తయారయ్యింది. అయితే త్రిష మాత్రం ఎవరూ ఎవరికీ పోటీ కాదని లైట్ తీసుకుంటోంది.

ప్రియమణి, త్రిష, సినిమాలలోనే కాదు నిజజీవితంలో కూడా పోలికలు ఒకే విధంగా ఉన్నాయంటున్నారు సన్నిహితులు, త్రిష పబ్ ల్లో తాగినట్టే ప్రియమణికూడా పబ్ లో తాగి పడిపోయింది దాంతో ఆమె ప్రక్కనున్న కోస్టార్ ఆమెను ఇంటిదాకా దిగబెట్టారని బోగట్టా. మొన్న ఆ మద్య త్రిష ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ఆమె తల్లి బ్రాహ్మణ పెళ్ళికొడుకుల వేటలో పడింది. ఇప్పుడు అదేవింధంగా ప్రియమని తల్లికూడా పెళ్లికొడుకు కొరకు వేట మొదలెట్టినట్టు సమాచారం. మరి ప్రియమణి, త్రిష బాలీవుడ్లో నిలదొక్కుకొంటారా లేక మమ్మీలు చూసిన వరుడుతో పెళ్ళి చేసుకొనే సెటిలవుతారో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu