»   » ఆరోపణలు రుజువు చేయండి.. లేకపోతే సూసైడ్ చేసుకొంటా.. టీవీ నటి హెచ్చరిక..

ఆరోపణలు రుజువు చేయండి.. లేకపోతే సూసైడ్ చేసుకొంటా.. టీవీ నటి హెచ్చరిక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు టెలివిజన్ పరిశ్రమలో టీవీ సీరియల్ నటి, వాణి రాణి సీరియల్ ఫేం సబితా రాయ్ వివాదం రచ్చరచ్చగా మారింది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ వీడియో రూపంలో ఓ టెలివిజన్ చానెల్ ప్రసారం చేయడంతో ఈ వివాదం మరింత రాజుకొన్నది. ప్రముఖ టెలివిజన్ సంస్థ రాదాన్ మేనేజర్‌కు సబితాకు జరిగిన గొడవ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. వారి మధ్య జరిగిన గొడవను ఓ వీడియో రూపంలో ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్ ప్రసారం చేసింది. టెలివిజన్, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ఫ్రచారంపై ఇటీవల సబితా వివరణ ఇచ్చారు..

టీవీలో వీడియో ప్రసారం..

టీవీలో వీడియో ప్రసారం..

మీడియాలో ప్రసారం చేసిన వీడియోలో సుకుమారన్, సబితా రాయ్ తీవ్రంగా కొట్టుకొన్నారు. సబితా రాయ్‌పై సుకుమారన్ దాడి చేసి కొట్టాడు. బదులుగా సబితా కూడా ప్రతిఘటించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. వారి మధ్య మాటల యుద్ధంగా కూడా జరిగింది. ఈ వీడియోను ఓ టెలివిజన్ చానెల్ ప్రసారం చేసి సబితపై కొన్ని ఆరోపణల చేయడం మరింత వివాదంగా మారింది.

రుజువు చేయండి..

రుజువు చేయండి..

తనపై మేనేజర్ సుకుమారన్, మీడియా ప్రసారం చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సబితా డిమాండ్ చేసింది. ఒకవేళ రుజువు చేయకుండా తప్పించుకు తిరిగితే నేను ఆత్మహత్య చేసుకొంటాను అని సబిత హెచ్చరించారు.

నేను చేసిన తప్పేంటి?

నేను చేసిన తప్పేంటి?

నేను చేసిన తప్పేందో, ఎవరినైనా మోసం చేశానా అని ఆమె నిలదీశారు. నా పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. టీవీలో వీడియో ప్రసారం కావడానికి ముందే నాపై కుట్ర పన్నారు అని సబితా కన్నీరుమున్నీరయ్యారు.

డబ్బుల కోసం మేనేజర్ ఇంటికి..

డబ్బుల కోసం మేనేజర్ ఇంటికి..

నాకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం మేనేజర్ సుకుమారన్ ఇంటికి వెళ్లాను. మూడు రోజులు తిప్పించుకొని రూ.20 వేలు ఇవ్వకుండా ఇబ్బంది పట్టారు. మా అమ్మ ఆరోగ్యం బాగా లేని కారణంగా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాను. అయినా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. నాకు తీవ్ర ఆగ్రహం కలుగడంతో తిట్టాను. దాంతో సుకుమారన్ నాపై చెయ్యి చేసుకొన్నాడు. చాలా విషయాలను వీడియోలో ఎడిట్ చేసి నాదే తప్పనే విధంగా చిత్రీకరించి ఓ వీడియో మీడియాకు ఇచ్చారు.

మీడియా అవాస్తవాలను ప్రసారం..

మీడియా అవాస్తవాలను ప్రసారం..

వీడియోలో ఉన్నవి కాకుండా తమ మధ్య ఏదో సంబంధం ఉందని అవాస్తవాలను మీడియా ప్రసారం చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ఓ వీడియో సబితా పోస్ట్ చేశారు. వారి కుట్రలు అందరికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను పోస్ట్ చేసింది.

సబితకు పెరుగుతున్న మద్దతు..

సబితకు పెరుగుతున్న మద్దతు..

తాజాగా సబితా వివరణ ఇవ్వడంతో ఆమెకు సోషల్ మీడియాలో నెటిజన్లు మద్దతుగా నిలిచారు. సుకుమారన్ తో గొడవ పడిన ఆమె తన ప్రతిష్టను పక్కన పెట్టి బయటకు ఎందుకు వస్తుంది. ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఏదైనా జరిగితే ఆమె వ్యక్తిగతం, అంతమాత్రాన ఆమెపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగునా అనే వాదన కొందరు వినిపిస్తున్నారు.

మేనేజర్‌తో గొడవ..

సబితా రాయ్ నటిస్తున్న ఓ సిరియల్ మేనేజర్‌తో గొడవపడినట్టు, వారిద్దరూ కలియబడి కొట్టుకొన్నట్టు ఉన్న వీడియో టీవీలో, ఫేస్‌బుక్‌, వాట్సప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రసారం కావడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సహజీవనం ఆరోపణలు..

సబితా రాయ్ రాదాన్ మేనేజర్‌తో కలిసి సహజీవనం చేస్తున్నదని వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా ఆమె మేనేజర్ సుకుమారన్ గొడవ పడినట్టు ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సబితా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మీడియా చేసిన నిర్వాకంపై ఆమె ఓ వీడియో రూపంలో వివరణ ఇచ్చింది.

English summary
A few days back, a Tamil private television news channel telecasted a video portraying popular Vani Rani fame serial actress Sabitha Rai in a bad light. There was also a press release from the actress clarifying on that issue, and now, she had put up a video on her personal social blogging page, pleading everyone not to spread false rumours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu