twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చిన్న సినిమా...శాటిలైట్ రైట్స్ కై ఛానెల్స్ ఫైట్

    By Srikanya
    |

    చెన్నై : పెద్ద సినిమాల కన్నా బాగున్న చిన్న సినిమాలకే కలెక్షన్స్ బాగుంటున్నాయనే విషయం మరోసారి రుజువైంది. 'పసంగ' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'గోలీసోడా'కు విజయ్‌మిల్టన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. త్వరలో తెలుగులోకి డబ్ చేయటానికి రెడీ అవుతున్న ఈ చిత్రం తమిళనాట ఆశ్చర్యపరిచే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మరో ప్రక్క తమిళ టీవీ ఛానెల్స్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడి వార్తల్లో నిలుస్తున్నాయి.

    కోయంబేడు మార్కెట్‌లో కొందరు చిన్నారులు తమ గుర్తింపు కోసం చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన కథ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా చక్కని వసూళ్లు రాబడుతోంది. 'దీన్ని తక్కువ బడ్జెట్‌తో కాదు.. అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించా'నని సినిమా విడుదలకు ముందే దైర్యంగా చెప్పారు దర్శకుడు.

    TV channels fight out for 'Goli Soda'

    అయితే బడ్జెట్ విషయం కలెక్షన్లపై ఎక్కడా ప్రభావం చూపలేదు. కానీ బుల్లితెర హక్కులపై మాత్రం దీని ప్రభావం కనిపించింది. రూ.10 లక్షలకు కొనుక్కునేందుకు కూడా కొన్ని ఛానళ్లు ముందుకు రాలేదు. సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాక.. ఏకంగా రూ.3కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంటామని చెబుతున్నాయి. అంటే ఆ మేరకు కూడా సంచలన విజయం సాధించనట్లే కదా.

    కోయంబేడు మార్కెట్‌లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు.

    ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్‌లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.

    'గోలీసోడా'ని చూసిన తర్వాత రజనీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ''కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో అద్భుతమైన సినిమా చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా నలుగురు కుర్రాళ్ల నటన అద్భుతం. దర్శకుడి పని తీరు నాకు నచ్చింది. అందుకే, ఫోన్ చేసి అభినం దించాను. తన తదుపరి చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని ఆ ప్రకటనలో రజనీ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అనుష్క, సమంత, మురుగదాస్ తదితర ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.

    English summary
    The satellite television rights for the recently released 'Goli Soda', written and directed by cinematographer turned director Vijay Milton is up for grabs. The buzz is that the asking price has gone up by a few notches after the film's release last week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X