»   » బడ్జెట్ ఎక్కువనే సినిమా ఆపుచేసా

బడ్జెట్ ఎక్కువనే సినిమా ఆపుచేసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బడ్జెట్ కంట్రోలు అనేది లేకపోతే ఎంత బాగా తీసినా, ఎలా ఆడినా నష్టపోతాం అనే విషయాన్ని నిర్మాతలు మాత్రమే కాదు హీరోలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా హీరో,నిర్మాత ఒకరే అయినప్పుడు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. యంగ్ హీరోలు నాలుగు కాలాలు పాటు నిలబడాలంటే మార్కెట్ తగ్గట్లే బడ్జెట్ అనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ విషయంలో ముందున్నాడు తమిళ యువ హీరో ఉదయనిథి స్టాలిన్.

‘కురువి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో ఉదయనిధి. తొలి రోజుల్లో సినిమా బిజినెస్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, తన చిత్రాన్ని భారీగా చూపాలనే ధ్యేయంతో ఖర్చులు పెట్టి చేతులు కాల్చుకున్నాడు ఉదయనిధి. అప్పుడు ఆయన నటించిన చిత్ర బడ్జెట్‌ రూ. 18 కోట్లయితే, వసూళ్లు మాత్రం రూ. ఐదు కోట్లు దాటలేదు.

దీంతో అప్పటి నుంచి తాను నటించే సినిమా లాభనష్టాలను గమనిస్తూ...తర్వాతే సినిమాను తీయడం ప్రారంభించారు. ఇందుకు నిదర్శనం... తాజాగా ఉదయనిధి నటించి విడుదలకు సిద్ధమైన ‘కొత్తు'. ఈ చిత్రానికి రూ. 8 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదు.

Udhayanidhi stalin want to control expenses

అంతేకాదు ఇటీవల ‘ఇదయం మురళీ' అనే సినిమాలో ఉదయనిధి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ చిత్రం నుంచి ఉదయనిధి వైదొలగారు. అదేమని ఆయన్ను ప్రశ్నిస్తే.. ‘ఇదయం మురళీ' కథను బట్టి చిత్ర షూటింగ్‌ అంతా విదేశాల్లోనే ఉండడంతో బడ్జెట్‌ ఎక్కువవుతోందనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు తెలిపారు.

ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌లో ఒక కథను చెప్పాలని దర్శకుడు హమీద్‌ను అడిగానన్నరు. అందుకు హమీద్‌ హిందీ సినిమా ‘జాలీ ఎల్‌ఎల్‌బి' డీవీడీని తన చేతికి ఇచ్చాడని తెలిపారు. దాన్ని చూసిన వెంటనే కథ నచ్చడంతో తమిళ రీమేక్‌ హక్కులను కూడా పొందినట్టు తెలిపారు. తాను కొత్తు చిత్రం తర్వాత నటించనున్న సినిమా అదేనని ఉదయనిధి తెలిపారు.

English summary
Tamil Hero Udhayanidhi stalin want to control expenses for his movies. Now he wish to make his movies less than 5 cr.
Please Wait while comments are loading...