»   » అఫీషియల్: 'ఉత్తమ విలన్‌' విడుదల తేదీ ప్రకటన

అఫీషియల్: 'ఉత్తమ విలన్‌' విడుదల తేదీ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా, రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషన్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఉత్తమ విలన్‌'. 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ హీరోగా నటించారు. గిబ్రాన్‌ సంగీతంలోని ఈ సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ చిత్రం మే ఒకటో తేదీన తెరపైకి తీసుకొస్తామని చిత్రవర్గాలు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అన్నీ పూర్తయినా.. ఈ చిత్రం విడుదల మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది. ఈ నెల రెండో తేదీన సినిమాను విడుదల చేస్తామని ఆరంభంలో ప్రకటించారు. ఆ తర్వాత ఏడో తేదీన విడుదల చేస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా చిత్ర విడుదల మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం మే ఒకటో తేదీన తెరపైకి తీసుకొస్తామని ఓ ప్రకటన విడుదల చేసారు.


ఇదిలా ఉండగా సినిమా ఓ వైపు విమర్శలకు, సమస్యలకు కూడా దారిస్తోంది. వీటన్నింటినీ అధిగమించడానికే వాయిదా వేసినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.


వివాదం ఏమిటంటే..


Uthama Villain New release date confirmed

కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తమిళనాడు వింగ్ ఆందోళన ప్రారంభించింది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది.


విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురిచే విధంగా ఉందని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.


కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కె.బాలచందర్‌ కీలకపాత్ర పోషించారు. కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, నాజర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు కూడా నటించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
Kamal Haasan’s Uthama Villain has cleared all the hurdles and the final release date has been confirmed. Uttama Villain is all set to hit the screens on May 1st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu