»   » 'ఉత్తమ్‌ విలన్‌'కి ఆరు అంతర్జాతీయ పురస్కారాలు

'ఉత్తమ్‌ విలన్‌'కి ఆరు అంతర్జాతీయ పురస్కారాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా, రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషన్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం ఆ మధ్యన విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. గిబ్రాన్‌ సంగీతంలోని ఈ సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో ఉత్తమ్‌ విలన్‌ చిత్రానికి ఆరు అంతర్జాతీయ పురస్కారాలు లభించటం అందరికీ ఆనంద కారణమైంది.

In Los Angles International Film Festival, Uttama Villain has won Best Film - Uttama VillainBest Actor - Kamal...


Posted by Kamal Haasan on 15 November 2015

లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఐదు పురస్కారాలను, రష్యాలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఒక పురస్కారాన్ని అందుకుంది. లాస్‌ ఏంజిల్స్‌లో ఉత్తమ చిత్రం, కమల్‌ హాసన్‌కి ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ గీతం, ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ పురస్కారాలు వరించాయి. రష్యన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సంగీత దర్శకుడు గిబ్రాన్‌కి 'ఉత్తమ సంగీతం' పురస్కారం లభించింది. ఈ పురస్కారాల పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కె.బాలచందర్‌ కీలకపాత్ర పోషించారు. కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, నాజర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు కూడా నటించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
Kamal Haasan's Uttama Villain bags awards at Los Angeles Independent Film Festival.
Please Wait while comments are loading...