»   » ఆ స్టార్ హీరో సహాయంతో గట్టెక్కాడు....

ఆ స్టార్ హీరో సహాయంతో గట్టెక్కాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో శింబు నటించిన ‘వాలు' చిత్రం చాలా కాలంగా విడుదల సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన సమస్యలు తీరిపోయి విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా విడుదల విషయంలో తమిళ స్టార్ విజయ్ చాలా హెల్ప్ చేసాడని అంటుననాడు శింబు తండ్రి టి. రాజేందర్

‘వాలు' విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించామని, ఎట్టి పరిస్థితుల్లోను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని మంగళవారం చెన్నైలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ తెలిపారు.

'Vaalu' finally releasing

శింబు సినీ క్రియేషన్స్‌పై ‘వాలు' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తానే విడుదల చేయబోతున్నానని, తమిళనాడులో 300 థియేర్లలలో విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రం విడుదలకు విజయ్‌ చేసిన సాయం ఎప్పటికీ మరువలేనని, తోటి కళాకారుడికి సహాయం చేసే గొప్ప మనసు ఉందని, ఆయన చేసిన సాయం ఆర్థికపరమైనది కాదే, నైతిక మద్ధతు మాత్రమేనని స్పష్టం చేశారు. విజయ్‌ ‘పులి' విడుదలకు ఎటువంటి సాయం అవసరమైనా చేసేందుకు సిద్ధమన్నారు టి రాజేందర్.

కుట్ర జరిగింది...
శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాన్ని విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని నటుడు, నిర్మాత అయినత టి.రాజేంద్రన్ గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల లేటవుతుడటంతో శింబు అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.'

English summary
Vaalu, which has been in the making for the past two years and had encountered roadblocks for its release, will finally see the light of day this week.
Please Wait while comments are loading...