»   » ధనుష్ న్యూ మూవీ ‘వడ చెన్నై’ ఫస్ట్‌లుక్

ధనుష్ న్యూ మూవీ ‘వడ చెన్నై’ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 'వడ చెన్నై' గత మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అతడు 'అన్భు' అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ పోస్టర్లో ధనుష్ పోలీస్ వ్యాన్ నుండి బేడీలతో బయటకు దిగుతూ కనిపించారు. అతడి సరసన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ 'పద్మ' అనే పాత్రలో కనిపించబోతోంది. ఈ ఇద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్నారు.

ఇందులో ధనుష్ నేషనల్ లెవల్ క్యారమ్ ప్లేయర్‌గా కనిపించబోతున్నారు. టైటిల్ చూసి చాలా మంది ఇదో గ్యాంగస్టర్ సినిమా అని భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని దర్శకుడు వెట్రిమారన్ స్పష్టం చేశారు.


ఈ చిత్రం ఒక విలేజ్‌లోని కమ్యూనిటీ నేపథ్యంలో సాగుతుందని, 35 సంవత్సరాల టైమ్ ఆఫ్ స్పాన్‌లో జరిగే సంఘటనల నేపథ్యంలో మూవీ ఉంటుందని తెలుస్తోంది. హీరో ధనుష్-దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఇప్పటికే వీరి కాంబినేషన్లో పొల్లాతవన్, ఆడుకాలమ్ చిత్రాలు వచ్చాయి.

'వడ చెన్నై' రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా ఖరారు కాలేదు. దీనికి సీక్వెల్ కూడా వస్తుందని, రెండు పార్టులకు కలిపి షూటింగ్ సాగుతుందని టాక్. 'వడ చెన్నై'లో ధనుష్ మరోసారి తన మాస్ హీరోయిజంతో అభిమానులను అలరించబోతున్నాడు.

English summary
A project that has been in the making for three years, Vada Chennai’s first look was unveiled on Thursday. Tweeting the poster, Dhanush revealed the name of his character – ‘Anbu’ (love). He also wrote, “#vadachennai first look !! #அன்பு it’s not just his name.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu