»   » స్వామి నిత్యానందగా స్టార్ కమిడెయన్

స్వామి నిత్యానందగా స్టార్ కమిడెయన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్న స్వామి నిత్యానందగా ప్రముఖ హాస్య నటుడు వడివేలు త్వరలో అవతారమెత్తనున్నాడు. ఆయన హీరోగా నటించే కొత్త చిత్రంలో కథ మొదటి వరేది అనుకున్నప్పటికీ ఈ హాట్ టాపిక్ ని అనుసరించి కథనం మార్చారని చెప్తున్నారు. అలాగే రంజిత, రాధ, అంబిక వంటి వారి పోలికలు ఉన్న వారిని వెతికి మరీ పెట్టాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని తమిళ మీడియా చెప్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మళయాళ బాషలు మూడింటిలో తీయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు వడివేలుపై నిత్యానంద గెటప్ వేసి ఫొటో షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నిజ జీవిత పాత్రలను పోలిన సినిమా చేస్తే క్రేజ్ తో పాటు లీగల్ గా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ తరహా జాగ్రత్తలు తీసుకునే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారు.అన్నీ అనుకూలిస్తే మే రెండవ వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఇక ఇంతకు ముందు వడివేలు ప్రధాన పాత్రలో చేసిన 23 వ హింసించే రాజు పులకేసి చిత్రం హిట్ ఈ చిత్రానికి ప్రేరణ ఇస్తోందని యూనిట్ వర్గాలు వ్యాఖ్యానించాడు.ఇక ఈ చిత్ర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu