»   » హీరోని విమర్శించినందుకు స్టార్ కమిడియన్ పై దాడి

హీరోని విమర్శించినందుకు స్టార్ కమిడియన్ పై దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరో విజయ్‌కాంత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించడంతో హాస్యనటుడు వడివేలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.మరో ఘటనలో కూడా ఆయన ప్రచార వాహనంపై దాడి జరిగింది. రామనాథపురం జిల్లా ముదుకుళత్తూరు డీఎంకే అభ్యర్థి సత్యమూర్తికి మద్దతుగా వడివేలు సోమవారం రాత్రి తమిళనాడులోని కముదిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బస్టాండులో వ్యాను పైనుంచి ప్రచారం చేస్తూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ను విమర్శించారు. ఆ సమయంలో జనం మధ్య నుంచి ఆయనపైన కొందరు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కలకలం రేగింది. చివరకు వడివేలు ప్రచారం ముగించుకొని శివగంగై వెళ్లిపోయారు. మరో ప్రక్క మరో కమిడియెన్...సెంధిల్ ...ఒకప్పటి హీరోయన్ ఖుష్బూ పై విరుచుకుపడ్డారు.పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు.

English summary
Popular Tamil Comedian Vadivelu, who is the star campaigner for the ruling DMK in Tamil Nadu, alleged that he escaped an attack bid late night at Alanganallur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X