»   » 25 పాత్రల్లో వడివేలు...కమల్ రికార్డు బ్రద్దలు

25 పాత్రల్లో వడివేలు...కమల్ రికార్డు బ్రద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్లూ కమల్ హాసన్ దశావతారంలో పది పాత్రలు ఒక్కడే నటించటం హైలెట్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ రికార్డుని బ్రద్దలు కొట్టడానికి ప్రముఖ హాస్య నటుడు వడివేలు నడుం బిగించారు. ఉలాగమ్ (ప్రపంచం) అనే టైటిల్ తో అతను ఇరవై ఐదు పాత్రలు పోషిస్తున్నాడు. అవి వేటికవే విభిన్నంగా ఉంటాయని చెప్తున్నాడు. హాస్య నటుడైనా చిత్రం కథ, అందులో తన పాత్ర ప్రాధాన్యం తెలుసుకుని చేసే వడివేలు ఈ సారి అటువంటిదేమీ లేకుండానే కేవలం 25 పాత్రలు అనేది వినే డేట్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఫూర్తి స్ధాయి కామిడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 23వ పులికేసి రేంజిలో వ్యంగ్యంగా సాగుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని వడివేలు కు క్లోజ్ గా ఉండే ఆదమ్ బావ అనే అతను డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఒక్కొక్క సినిమాకు పది నుంచి పన్నెండు రోజులు కాల్ షీట్స్ ఇచ్చే వడివేలు ఈ చిత్రం కోసం కంటిన్యూగా వందరోజులు కు పైగా కేటాయించాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పది మంది దాకా హీరోయిన్స్ నటించనున్నారు. తమిళ, తెలుగు, మళయాళ బాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దామనుకుంటున్న ఈచిత్రంకు గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ ప్రముఖులను రప్పించనున్నారు. ఇక ప్రపంచంలో ఇటువంటి ప్రయత్నం జరగటం ఇదే మొదటి సారి అని చెప్తున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు కోసమే ఈ ప్రయోగం చేస్తున్నారని చెన్నై సర్కిల్స్ లో వినపడుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వినపడనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X