»   » ఫుల్ ఫన్ : సదా తో వడివేలు డాన్స్ (వీడియో)

ఫుల్ ఫన్ : సదా తో వడివేలు డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నాలుగేళ్ల విరామం వచ్చినప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో 'తెనాలి రామన్‌' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు వడివేలు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయినా ఎంతో మంది అభిమానుల్లో వడివేలు మళ్లీ ఉత్సాహాన్ని నింపారనే చెప్పాలి. 

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా 'ఎలి' (ఎలుక) టైటిల్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి కూడా యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సదా హీరోయిన్. సదా తో కలిసి చేసిన పాటతో కూడిన ట్రైలర్ ని వదిలారు. పూర్తి ఫన్ తో ఉన్న ఈ ట్రైలర్ ని మీరు వీక్షించండి.

అలాగే... కైపుల్ల, వకీల్‌ వండు మురుగన్‌, స్నేక్‌బాబు, నాయ్‌ శేఖర్‌... ఇలా ఎన్నిరకాలుగా పిలిచినా వడివేలు పలుకుతారు. వెండితెరపై ఆయన పండించిన హాస్యం మాత్రమే కాకుండా పోషించిన పాత్రలు కూడా ప్రేక్షకుల మదిలో నాటుకుపోయాయి. ఈ చిత్రం సందర్భంగా వడివేలు మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లోకి వస్తే రావొచ్చు మన చేతిలో ఏముంది. అంతా భగవంతుడి పనే. జీవితంలో ఏం జరుగుతుందని లెక్కగట్టగలమా?. అయితే ప్రస్తుతానికి రాజకీయాలనే ఆ దుకాణాన్ని మూసివేశా. ఇప్పుడు హాస్యానికే స్వాగతం పలుకుతున్నారు.

ఆ ఇంటర్వూ ఇప్పుడు మీ కోసం ...

'ఎలి' (ఎలుక) అని టైటిల్‌ అందుకే పెట్టాం

'ఎలి' (ఎలుక) అని టైటిల్‌ అందుకే పెట్టాం

వడివేలు మాట్లాడుతూ... నేను కూడా దర్శకుడిని ఇదే ప్రశ్నించా.ఎలుక చేసే అల్లరిని నేను సినిమాలో చేస్తా. సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఓ ముఠాలో చేరి ఆ ముఠాను అంతం చేయడానికి కృషి చేస్తా ...అందుకే ఈ టైటిల్ పెట్టారు అన్నారు.

ఎలకే కరెక్టు...ఎందుకంటే

ఎలకే కరెక్టు...ఎందుకంటే

అలా ముఠాలోకి ప్రవేశించి.. వారి అంతు చూడటాన్ని బ్లాక్‌షిప్‌ అనేగా అంటారు. మరి 'ఎలుక' అని పెడుతున్నారెందుకు అని. అలాకాదు మంచివారి మధ్యలోకి దొంగ ప్రవేశిస్తే అతన్ని 'బ్లాక్‌షిప్‌' అనాలి. కానీ ఈ సినిమాకు 'ఎలి'నే కరెక్టు అని చెప్పారు. ఇది వన్‌లైన్‌ కథ మాత్రమే.

ఫుల్ కామెడీ...

ఫుల్ కామెడీ...

సినిమా చూస్తే.. మీరే ప్రతి సన్నివేశంలోనూ పగలబడి నవ్వుతారు.

1960లో జరిగే కథలా ఉందే...

1960లో జరిగే కథలా ఉందే...

అవును... రొటీన్‌కు భిన్నంగా ఓ సారి పాతకాలానికి వెళ్లొద్దామని అనుకున్నా. కేవలం 30 ఏళ్ల వెనక్కి వెళ్లాం అంతే. ప్రేక్షకులకు పీరియడ్‌ చిత్రమనే భావన కలగకుండా సినిమా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రేక్షకులను 1960లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఆ స్థాయిలో కృషి చేసిన దర్శకుడు యువరాజ్‌కే కృతజ్ఞతలు చెప్పాలి.

ఇంత గ్యాప్‌ తీసుకున్నారు.?

ఇంత గ్యాప్‌ తీసుకున్నారు.?

మళ్లీ పాత కథను తవ్వకండి ప్లీజ్.... 'తెనాలిరామన్‌' ముందు తీసుకున్న గ్యాప్‌కు ఇప్పటికే పలుమార్లు సమాధానం చెప్పా. కొన్ని తప్పిదాలతో అలా వెళ్లాల్సి వచ్చింది. 'ఎలి' చిత్రం మరిన్ని రెట్లు అద్భుతంగా రావాలనే శ్రద్ధ తీసుకుంటున్నాం. అందుకే ఈ సినిమాకు కొంత సమయం తీసుకున్నా అన్నారు.

మీకు హీరోయిన్స్ దొరకటం లేదని...

మీకు హీరోయిన్స్ దొరకటం లేదని...

హాస్య నటులు హీరోలుగా నటించే చిత్రాల్లో హీరోయిన్స్ నటించడానికి వెనకడుగు వేస్తున్నారు. నిజానికి మేమైనా పెళ్లిచేసుకుని అత్తగారింటికి వెళ్తున్నామా ఏంటి?.. ఈ హీరోయిన్‌ కాకపోతే ఇంకో హీరోయిన్‌. సినిమాలో ఇదంతా సహజంగా మారిపోతోంది.

సదా ఒప్పుకుంది...

సదా ఒప్పుకుంది...

ఇందులో సదాను అడిగాం. నటిస్తానని ఒప్పుకున్నారు. అయితే ఇందులో గాఢమైన ప్రేమ సన్నివేశాలు లేవు. కథ, హాస్యానికే ప్రాధాన్యత ఇచ్చాం. చిన్న పిల్లలంతా కుటుంబ సమేతంగా హాయిగా చూడదగ్గ సినిమా ఇది.

ఈ సినిమాలో ఎలుక మీరు... పిల్లి ఎవరు.?

ఈ సినిమాలో ఎలుక మీరు... పిల్లి ఎవరు.?

గజని చిత్రంలో సూర్యకు విలన్‌గా నటించారే ప్రతాప్‌. ఆయనే ఇందులో గంభీర్యంగా నటించారు. ఆయనే ఇందులో విలన్‌.

రజనీ తో చేస్తారా...

రజనీ తో చేస్తారా...

ఆయన 'తలైవర్‌'. మేం ఇద్దరం కలిసి 'చంద్రముఖి'లో హాస్య జల్లులు కురిపించాం. మళ్లీ అలాంటి అవకాశం వస్తే వదులుకోను.

మీ 'ఎలుక' చిత్రం విజయ్ 'పులి'కి పోటీగా అంటున్నారు

మీ 'ఎలుక' చిత్రం విజయ్ 'పులి'కి పోటీగా అంటున్నారు

ఇదిగో... ఇరికించడమంటే ఇదే. సినిమా పేర్లను బట్టి పోటీ పెడితే ఎలా. వారి కథకు తగ్గట్టు సినిమా పేర్లను పెట్టుకుంటారు. ఇందులో మా రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ లేదు.

English summary
Vadivelu has been shooting for ‘Eli’ at a marathon pace for the past few weeks and there were wide media speculations about what the storyline would be. Director Yuvaraj has come clean with all details about the comedy fest.
Please Wait while comments are loading...