»   » స్టార్ తో పెట్టుకుని ఖాళీ పడ్డ స్టార్ కమిడెయిన్

స్టార్ తో పెట్టుకుని ఖాళీ పడ్డ స్టార్ కమిడెయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకూ వసూలు చేసిన స్టార్ కమిడియన్ వడివేలు.ఆయన గత పది రోజులుగా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పూర్తి ఖాళిగా ఉన్నాడు. దానికి కారణం రజనీకాంత్ తో వడివేలు తగువు పెట్టుకోవటమే.రజనీ నటించాల్సిన 'రాణా' చిత్రం నుంచి వడివేలును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ అన్నాడీఎంకే గుర్తుపై ఓటేసినట్లు మీడియాలో పొక్కడంతో అసహనానికి గురైన వడివేలు.. 'రజనీ గిజనీ జాన్తానై.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినరోజు వీరందరి సంగతి తేలుస్తా' అని ప్రకటించారు. ఇది కూడా పరిశ్రమలోని రజనీ మద్దతుదారుల కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వడివేలుకు ఒక్క సినిమా కూడా లేకపోయింది. అయితే 'ప్రస్తుతం జరుగుతున్నదానికి వడివేలు ఏమీ పశ్చాత్తాప పడట్లేదు. తన కోపాన్ని, తన మనసులోని మాటను బయటపెట్టగలిగానని సంతృప్తి పడుతున్నారు' అని వడివేలు గురించి సన్నిహితులు చెప్తున్నారు.గతంలోనూ మరో స్టార్ హీరో విజయ్ కాంత్ తో తగువు పెట్టుకున్నాడు. ఆ గొడవ వడివేలు నివాస స్దలం వద్ద మొదలైంది.

చెన్నై, సాలిగ్రామంలో వడివేలు నివాసం.. డీఎండీకే అధినేత విజయకాంత్ కార్యాలయం ఒకే చోట ఉన్నాయి. అదే వడివేలుకు కష్టాలు తెచ్చిపెట్టింది. విజయకాంత్ కార్యాలయానికి వచ్చిన నేతలు, కార్యకర్తల కార్లు వడివేలు ఇంటి ముందు పార్కింగ్ చేసేవారు. దాంతో ఆయన కుటుంబీకులు బయటికెళ్లడానికి వీల్లేకపోయేది. ఈ వ్యవహారంతో మనస్తాపం చెందిన వడివేలు 2008 సెప్టెంబరులో ఓ రోజు డీఎండీకే కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఆగ్రహించిన కార్యకర్తలు ఆయన ఇంట్లోకి జొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విజయకాంత్ దీన్ని ఖండించకుండా మిన్నకుండిపోయారు. దీంతో వడివేలు విజయకాంత్‌పై, తన ఇంటిపై దాడికి దిగినవారిపై.. హత్యాయత్నం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇంటిపై మళ్లీ రాళ్లు పడటం, కొన్ని హత్యా బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడంతో చిర్రెత్తి.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్‌ను ఓడిస్తానని బహిరంగ శపథం చేశారు. విజయ్‌కాంత్ అన్నాడీఎంకేతో కలిసి పోటీచేయడంతో.. వడివేలు డీఎంకేకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రమంతా తిరుగుతూ 20 రోజుల పాటు చేసిన ప్రచారంలో హద్దుమీరి విమర్శలు చేశారు. విజయకాంత్‌ని పలుమార్లు 'ఒరేయ్' అంటూ సంబోధించడంతో పాటు ఆయన సతీమణిపై కూడా మాటల తూటాలు పేల్చి విమర్శలకు గురయ్యారు.

English summary
Vadivelu was offered a role in Rajinikanth's KS Ravikumar directed Rana, but at the last minute he was dropped.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu